• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.

Publish Date : 07/07/2025

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు..అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలి… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసి రెడ్డి, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 165 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నందున జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన, నాణ్యమైన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు. ఫిర్యాదుదారునితో మాట్లాడకుండా ఫిర్యాదును ముగించరాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియపై ఐవిఆర్ఎస్ ద్వారా ఫిర్యాదుదారులతో మాట్లాడి అభిప్రాయాన్ని సేకరించినప్పుడు ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందాను అనే సమాధానం ఇచ్చేలా సమస్యను పరిష్కరించాలన్నారు.అర్జీ దారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులలో కొన్ని ఇలా ఉన్నాయి@ భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామం నివాసి పేరిచర్ల చంద్రకాంతం (84) నాకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారని, నా కుమారులు నాకు వైద్యం చేయించడం గాని, భోజనం గాని పెట్టడం లేదని, నా చిన్న కుమారుడు పేరేచర్ల నరసింహ రాజు నాకు ఉన్న 242 చదరపు గజాల స్థలాన్ని హాస్పిటల్ కి వెళ్దామని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లి బలవంతంగా వేలిముద్రలు వేయించుకొని రాయించుకున్నారని జిల్లా కలెక్టర్ కు పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ పూర్వపరాలను పరిశీలించి వయోవృద్ధుల చట్టం ప్రకారం తగు చర్యలకు ఫైల్ ను సిద్ధం చేయాలని వయోవృద్ధుల ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గా ప్రసాద్ ను ఆదేశించారు.@ రొయ్యలు పట్టుబడి సమయంలో తూకాలలో జరుగుతున్న మోసాలపై పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకువచ్చారు. సరైన స్థిరీకరణ జరిగిన తూకా యంత్రాలను అమ్ముతున్నారా లేదా అనే విషయంలో సంబంధిత అధికారులతో ఆకస్మిక తనిఖీలు జరిపించాలని, తక్కువ తూకాలు చూపి మోసం చేసే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, రైతుల ఫిర్యాదుల పై స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు.@ వీరవాసరం మండలం నందమూరు గురువుకు చెందిన చింత వెంకన్న వయస్సు 62 సంవత్సరాలు అర్జీ సమర్పిస్తూ తాను బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నానని, నిత్య జీవిత అవసరాలన్నీ ఇతరుల సహాయంతోనే పూర్తి చేసుకోవలసిన పరిస్థితిలో ఉన్నానన్నారు. ఇటువంటి స్థితిలో నాకు వైద్య సహాయం మరియు జీవనాధారం కొరకు ప్రభుత్వం వారు అందిస్తున్న 15,000 రూపాయాల పింఛన్ మంజూరు చేయాలని@ యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు రూతమ్మ అర్జీని సమర్పిస్తూ, తనకు ఒంటరి మహిళ పింఛన్ మంజూరు అయిందని, ఇటీవల ఉపాధి కొరకు గల్ఫ్ వెళ్ళడం జరిగిందని, అక్కడ అనారోగ్య కారణంగా వైద్యం చేయించుకుని ఆరు నెలల తదుపరి అడవిపాలం గ్రామానికి వచ్చానన్నారు. ఒంటరి మహిళ పింఛను కొరకు సచివాలయంలో సంప్రదించగా ఆరు నెలలు తీసుకోకపోవడం వల్ల పింఛన్ రద్దు చేయడం జరిగింది అన్నారు. దయచేసి నా ఒంటరి మహిళ పింఛను తిరిగి పునరుద్ధరించవలసిందిగా కోరారు.@ భీమవరం మండలం జొన్నలగరువు చిన్న పేటకు చెందిన బొడ్డు రాజేశ్వరి అర్జీని సమర్పిస్తూ, తనకు జొన్నలగరువులో ఐదు సెంట్లు స్థలం ఉందని నాలుగు ప్రక్కల రోడ్డు ఉండటంవల్ల అరసెంటు భూమి తగ్గిందని దయచేసి సర్వే చేయించి ఐదు సెంట్లు స్థలం ఇప్పించాలని కోరారు.@ వీరవాసరం మండలం ఉత్తర పాలెం పంచాయితీ పడమటి పాలెం గ్రామానికి చెందిన పితాని అర్జున్ రావు పడమటిపాలెం గ్రామంలో కొత్తగా రేషన్ షాప్ పెట్టుకోవడానికి అనుమతి కొరకు అర్జీని సమర్పించారు.ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వర్రావు, భీమవరం మున్సిపాలిటీ సహాయ కమిషనర్ ఏ.రాంబాబు, డిపిఓ ఎన్.రామ్నాథ్ రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ జి.గీతా బాయి, వయోవృద్ధుల ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.