ఈ నెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్

గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పిటిఎమ్ సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఒక పండుగ వాతావరణంలో, సమగ్ర విద్యా అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్వహించనున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,931 ప్రభుత్వ ప్రైవేటుపాఠశాల నుండి విద్యార్ధులు వారి తల్లి దండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు. అలాగే ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో కూడా జిల్లాలో నున్న 102 జూనియర్ కళాశాలల నుండి విద్యార్ధులు వారి తల్లి, తండ్రి తో సహా హాజరు కానున్నట్లు తెలిపారు. పిల్లలే ఆహ్వానాలను తల్లి దండ్రులకు అందిస్తారని, ఆహ్వానంతో పాటు ఒక ఫార్మాట్ ను కూడా ఇస్తారని, తల్లి తండ్రులు ఆ ఫార్మాట్ పై వారి అభిప్రాయాన్ని రాసి ఇస్తారని పేర్కొన్నారు. పండగలా నిర్వహించే ఈ కార్యక్రమాలలో పాఠశాల అభివృద్ధికి కావలసిన మౌలిక వసతుల కల్పన, విద్యార్ధుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాల పై చర్చ జరుగుతుందని, టీచర్, స్టూడెంట్, పేరెంట్స్ తో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్ధి గత ఏడాది సాధించిన ప్రతిభను, ఈ ఏడాది సాధించవలసిన దాని గురించి చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశం లోపలే విద్యార్ధులందరికీ వైద్య పరీక్షలు జరిపి వారి ఆరోగ్య స్థితిపై 10న వారికీ అందించే హోలిస్టిక్ కార్డ్స్ నందు రిమార్క్స్ కాలం లో రిపోర్ట్ చేసి ఇస్తారని తెలిపారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానించడం జరుగుతుందని, అలాగే పూర్వ విద్యార్ధులను, అక్కడే చదివి ఉన్నత స్థానాల్లో నిలిచిన గొప్ప వ్యక్తులను కూడా ఆహ్వానించి సన్మానించడం జరుగుతుందన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీసీ పలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని, అలాగే తల్లి దండ్రులకు కూడా రంగోలి, టగ్ అఫ్ వార్ , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. తల్లి పేరుతో ఒక మొక్క నాటడం ఈ ఏడాది థీమ్ గా తీసుకోవడం జరిగిందని, పాఠశాల ఆవరణ లో కానీ, లేదా వారి ఇంటి వద్దగానీ మొక్క నాట వచ్చునని తెలిపారు. అందుకోసం లీప్ (LEAP) యాప్ లో లాగిన్ అయి వారి పేరును నమోదు చేసుకోవాలని, పెరుగుతున్న మొక్కను ప్రతి ఏడాది ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమాల పర్యవేక్షణకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక అధికారులను నియమించడం జరుగుతుందన్నారు.