కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దత్తత గ్రామం పి.ఎం లంక అభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఎంతైనా అవసరమైన జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు.

నరసాపురం మండలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దత్తతు గ్రామమైన పెద్దమైన వాని లంక గ్రామంలో డెలాయిట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తో చేపట్టిన అభివృద్ధి పనులను నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిరుధ్ ఎస్ పులిపాక సంయుక్తంగా శనివారం పరిశీలించారు. తొలుత పిఎం లంక డిజిటల్ భవన్ కు చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను స్వయంగా పరిశీలించి విద్యార్థులు ఏఏ ప్రాంతాల నుండి వచ్చి శిక్షణ పొందుతున్నారు, తదితర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో పీఎం ఇంటర్నెన్ షిప్ పథకం మీకు తెలుసా అని విద్యార్థులను ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా యువత నైపుణ్య అభివృద్ధి శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే శిక్షణతో పాటు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని, పేరుగాంచిన కంపెనీలో శిక్షణ అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేయడం కూడా జరుగుతుందని వివరించారు. అక్కడి గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ అమ్మగా పిలుచుకునే నిర్మలమ్మ ఇప్పటికే మా గ్రామానికి ఎంతో చేశారని, వారికి మేమంతా ఎంతో రుణపడి ఉన్నామన్నారు. మా గ్రామంలో 100 గృహాలకు పీఎం సూర్య ఘర్ కింద సోలార్ ప్యానల్స్ మంజూరు చేయడం జరిగిందని, అలాగే గ్రామం మొత్తం అన్ని గృహాలకు సోలార్ ప్యానల్స్ ఉచితంగా అందించాలని, ఇల్లు లేని వారికి గృహ నిర్మాణాలు చేయించాలని ఈ విషయాలను నిర్మలమ్మ దృష్టికి తీసుకెళ్లాలని వ్యక్తిగత కార్యదర్శిని గ్రామస్తులు కోరడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మా జిల్లాలో పీఎం లంక గ్రామాన్ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం మేమంతా వారికి రుణపడి ఉన్నామన్నారు. పీఎం లంక గ్రామం సముద్రపు కోతకు గురై ముంపుకు గురికావడంతో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న కేంద్ర మంత్రి ప్రస్తుతం రూ.13.75 కోట్ల రూపాయల వ్యయంతో డిలైట్ కంపెనీ చేపట్టిన సముద్రపు కోత నిరోధక అడ్డుకట్ట అక్టోబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గ్రామాభివృద్ధికి చేసే ప్రతి పనికి గ్రామస్తుల సహకారం చాలా అవసరమని, ఇది మీ గ్రామం కోసం, మీ శ్రేయస్సు కోసం చేస్తున్న పని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిరుధ్ ఎస్ పులిపాక మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గ్రామాభివృద్ధికి చేపట్టిన పనుల పర్యవేక్షణకు నేడు ఢిల్లీ నుండి రావడం జరిగిందని, మీరు సమావేశంలో కోరిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం “జియో టెక్స్టైల్ ట్యూబ్ సీవాల్'” (సముద్రపు రక్షణ గోడ) నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధించిన డిలైట్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టారు, నిర్మాణం ఎన్ని దశల్లో ఏ విధంగా జరుగుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్షణ గోడ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని కోరారు.
ఈ సందర్భంలో కేంద్రమంత్రి వ్యక్తిగత సహాయకులు విష్ణు సింగ్, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, జల వనరుల శాఖ ఎస్.ఇ నాగార్జున, ఈఈ సత్యనారాయణ, ఏఈఈ రమణ, జి ఎస్ డబ్ల్యూ అధికారి వై.దోసి రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఇ రఘునాథ్ బాబు, డిలైట్ కంపెనీ సీనియర్ కన్సల్టెంట్ అభయ్ వర్మ, పెదమైన వానిలంక సర్పంచ్ కె.కనకదుర్గ, తహసిల్దార్, తదితరులు ఉన్నారు.