• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పీ4పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్

Publish Date : 05/07/2025

శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి పీ4పై జిల్లా కలెక్టర్లు, శాసనసభ్యులు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా, సామజికంగా బలోపేతం చేసేందుకు పి-4 కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. సమాజంలో సంపన్నులు (మార్గదర్శకులు) పేద, బలహీన వర్గాల వారిని (బంగారు కుటుంబం) దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. సమాజం ద్వారా సంపన్నులుగా ఎదిగిన వారు పేదలను ఆదుకోవడం ద్వారా సమాజ సేవ చేసిన వారవుతారన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే బంగారు కుటుంబాల వారు మంచి జీవన ప్రమాణాలతో జీవనం సాగిస్తారన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మార్గదర్శికుల గుర్తింపు, బంగారు కుటుంబాల వారిని ఎంపికపై ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డ్వామ పీడి డా. కె సి హెచ్ అప్పారావు, సి పి ఒ కె.శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు.