Close

స్వయం సహాయక సంఘాల సభ్యులు నూతన ఆలోచనలు చేసి కొత్త ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 26/06/2025

బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎంటర్ పెన్యూర్ యాక్షన్ ప్లాన్ (EAP) అమలుపై మెప్మా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యానికి అనువైన యూనిట్ల స్థాపించి ఆర్థికంగా పురోగతి సాధించాలన్నారు. నూతన ఆలోచనలతో మార్కెట్ అవసరాలు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రయత్నించాలన్నారు. ప్లాస్టిక్ రహిత, వాతావరణ కాలుష్య రహిత ఉత్పత్తులు తయారీకి నూతన ఆలోచనలు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రైవేటు కార్యక్రమాలలో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి తద్వారా ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా ఉన్న యూనిట్ లను విస్తరించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. రాపిడ్ బైక్స్, తృప్తి క్యాంటీన్లు, అమృత మిత్ర, టూరిజం సర్వీసెస్ ఏర్పాటుకు కొత్తగా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఎంటర్ పెన్యూర్ యాక్షన్ ప్లాన్ నూరు శాతం అమలు చేసి లక్ష్యసాధనకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వచ్చే సమావేశం నాటికి నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేసి నివేదికలతో హాజరు కావాలన్నారు.

గూగుల్ మీట్లో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియం వద, ఏవో హెబ్సిబా, జిల్లా స్పెషలిస్టులు జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల సిటీ మిషన్ మేనేజర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, తదితరులు పాల్గొన్నారు.