Close

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్ పేరెడే గ్రౌండ్స్ లో వేలాది మంది యోగాభ్యాసనలో పాల్గొనడం పండుగ వాతావరణం తలపించిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 21/06/2025

పశ్చిమలో పండుగ వాతావరణంలో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు.

భీమవరంలో 8 వేల మందితో కనువిందు చేసిన యోగ అబ్యాసన కార్యక్రమం.

విశాలమైన 8 ఎకరాల మైదానంలో పచ్చని చెట్లు మధ్య ఆహ్లాదకరంగా జరిగిన యోగాబ్యాసనాలు

విశాఖలో ప్రధానమంత్రి పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అనుసరిస్తూ యోగా అభ్యసనాలు కొనసాగిన తీరు అత్యద్భుతం..

అందరినీ ఆకట్టుకున్న క్రమశిక్షణతో జరిగిన యోగా అభ్యాసన కార్యక్రమం.

పశ్చిమగోదావరి జిల్లా అంతట సుమారు 8 లక్షల మందితో 4,835 ప్రదేశాల్లో యోగ నిర్వహణ

.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

శనివారం భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు సుమారు 8 వేల మంది పాల్గొని విశాఖలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అనుసరిస్తూ యోగా అభ్యసనాలు కొనసాగిన తీరు అత్యద్భుతం.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి సూచన మేరకు గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగ అభ్యసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించు కోవడం జరిగిందన్నారు. ఈరోజు 8 వేల మందితో పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకు నేర్చుకున్న యోగ అభ్యాసన నిలిపివేయకుండా ప్రతిరోజు యోగాభ్యాసం చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు. నెల రోజులు పాటు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు, జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేసారని కితాబిచ్చారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 4,835 లొకేషన్స్ లో సుమారు 8 లక్షల మందితో విజయవంతంగా యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అన్నారు. విద్యార్థిని, విద్యార్థులు ప్రతిరోజు యోగా చేయాలని, తద్వారా శారీరిక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుం దన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజ్యసభ సభ్యులు పాకా నారాయణ మాట్లాడుతూ ఆరోగ్య వంతమైన భారతదేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. . ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉన్నారని వారందరినీ ఆరోగ్యవంతులను చేయడం ద్వారా ఆరోగ్య భారత్ గా తీర్చిదిద్దాలనేదే మోడీ ఆశయం అన్నారు. ప్రపంచంలో ఈ రోజున 175 దేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ప్రధానమంత్రి ఆశయం మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యోగాభ్యాసన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో గత నెల రోజుల నుండి నిరంతరాయంగా యోగ అభ్యసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్లను రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అభినందించారు.

అనంతరం గత నెల రోజులుగా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నిర్వహించిన యోగ పోటీల్లో జిల్లాస్థాయిలో వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డిఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, డ్వామ పీడీ డా. కే సి హెచ్ అప్పారావు, జిల్లా టూరిజం అధికారి ఎ.వి అప్పారావు, డీఈవో ఇ.నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.