Close

రెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాన కలిగి, ప్రజలకు మంచి సర్వీసులను అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు ఎల్లప్పుడూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 20/06/2025

శుక్రవారం ఘనంగా రెవిన్యూ డే వేడుకలను స్థానిక జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందికి రెవిన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసారు. రెవిన్యూ శాఖలో పనిచేయడం గర్వపడాల్సిన విషయంగా పేర్కొన్నారు. ప్రజలపట్ల సానుభూతితో వ్యవహరించాలన్నారు. రెవెన్యూ శాఖ ఒక వ్యవస్థ అని, రెవిన్యూ శాఖలో ఎక్కువ మొత్తంలో నవీకరణ విషయాలు ఉంటాయని, ఎప్పటికప్పుడు ఉద్యోగులు అప్డేట్ కావలసిన అవసరం ఉంటుందన్నారు. తెలియని విషయాలు నేర్చుకోవడంలో చిన్న, పెద్ద ఉద్యోగి అనే భావన ఉండకూడదన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు తదితర సందర్భాలలో రెవెన్యూ శాఖ ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు. ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, భూ వ్యవహారాలు, వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు, నీటి పన్నుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ శాఖ తరపున భవిష్యత్ లో చేపట్టాల్సిన భూ వ్యవహారాల సమస్యలతో పాటు, ప్రజలకు అందించే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందించే విధముగా రెవెన్యూ ఉద్యోగులు అందరు ప్రభుత్వానికి పూర్తి సహకారము అందించాలన్నారు. రెవిన్యూ స్పోర్ట్స్ ఏర్పాటుకు ఆలోచనచేయ్యా లన్నారు.దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, ఆ బోర్డు ఏర్పాటైన జూన్ 20వ తేదీన రెవెన్యూ డే చేసుకోవడం జరుగుతోందని తెలిపారు. రెవిన్యూ శాఖ ఏర్పడి 238 సంవత్సరాలు అయిందని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టరేట్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు రూల్స్ అనుసరిస్తూ మనసు పెట్టీ పనిచేయాలి. రెవిన్యూ శాఖలో పని నేర్చుకుంటే గుర్తింపు ఉంటుందని, శాఖకు సంబందించి ప్రతీ విషయాన్ని క్షుణంగా నేర్చుకోవాలని అన్నారు. శాఖకు ఉన్నటువంటి సామర్ధ్యము, శక్తిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రజలకు రెవెన్యూ శాఖపై నమ్మకం కలిగే విధంగా ఉండాలన్నారు. రెవెన్యూ శాఖలో ప్రతి ఫైల్ ఒక లైఫ్. జాగ్రత్తగా నిర్వహించాలి. ఎంత నేర్చుకున్నా, కాలానుగుణంగా వచ్చే సాంకేతికను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరికి శిక్షణ చాలా అవసరం. రెవెన్యూ శాఖను ఉన్నతికి, అభివృద్ధికి అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలన్నారు.

రెవిన్యూ అధికారులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు, సిబ్బంది అనుభవాలను, అభిప్రాయాలను, రెవిన్యూ శాఖ ప్రాముఖ్యతను, అభివృద్ధిని వివరించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు తహసిల్దార్ లక్కు నరసింహారావు, డిప్యూటీ తహసిల్దార్ బాబాజీ, తహసిల్దార్ పాంచజన్య మూర్తి, వీఆర్వో బి.వెంకట సుబ్బారావు, ఆఫీస్ సబార్డినేట్ మణికంఠ లను దుశ్యాలువాతో, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

చివరిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదగా కేకును కట్ చేయించి రెవెన్యూ డే సందర్భంలో అధికారులు, సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.సి.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. శివన్నారాయణ రెడ్డి, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎ.పి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్.శివ శంకర్, సెక్రటరీ ఎం.రామ్ ప్రసాద్ రాజు, ఎపిఆర్ఎస్ఎ ఉమెన్ వింగ్ సెక్రటరీ ఎస్.జీవన రాణి, సూపరింటెండెంట్స్ సిహెచ్.రవికుమార్, మర్రాపు సన్యాసిరావు, భీమవరం తహసిల్దార్ రావి రాంబాబు, రెవిన్యూ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శివశంకర్, తహసిల్దారులు, డిప్యూటీ తహసిల్దారులు, రిటైర్డ్ తహసిల్దార్లు, రెవిన్యూ అధికారులు, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.