Close

వేలాది మందితో ప్రశాంత వాతావరణంలో కనుల పండుగగా జరిగిన మెగా యోగా కార్యక్రమం.

Publish Date : 19/06/2025
22

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యోగా సందడి

ఒకేసారి 6 వేల మందితో యోగాబ్యాసనాలు నిర్వహణ..

యోగా భారతదేశ ప్రాచీన సంపద, ప్రపంచంలో 180 దేశాలలో యోగా సాధన ప్రతి భారతీయడు గర్వించదగ్గ విషయం.

సంపూర్ణ ఆరోగ్యo కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన ఒక దిన చర్యగా పెట్టుకోవాలి.

కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ …

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్ లో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో జిల్లాకు కేటాయించిన ప్రత్యేక థీమ్ అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్ తో నిర్వహించిన మెగా యోగా ప్రదర్శన కార్యక్రమానికి కేంద్రం ఉక్కు,భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు వర్మ శ్రీనివాసవర్మ, శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, పిఏసి చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సంయుక్తంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ యోగా భారతదేశ ప్రాచీన సంపదని, భారతదేశం యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. ప్రపంచంలోని 180 దేశాలలో ప్రజలు యోగా సాధన చేస్తుండడం ప్రతి భారతీయుడు గర్వపడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా సాధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యోగా సాధన వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను ఒక దిన చర్యగా చేసుకోవాలన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో నిర్వహించడం మన రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. భారత ప్రధానమంత్రి ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. గత నెల రోజుల నుండి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగా అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈరోజు ఇంత పెద్దఎత్తున యోగా ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్ష మేరకు ఆంధ్రరాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించనున్నామన్నారు. ఒకవేళ యోగా బహుమతులు ప్రకటిస్తే యోగా కార్యక్రమాల నిర్వహణలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంటాయన్నారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యోగ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి నందుకు జిల్లా కలెక్టరు మరియు జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

రాష్ట్ర పిఏసి చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని, యోగాసాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో జీవించగలుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దిన చర్యగా చేసుకోవాలన్నారు.
.
ఆచంట శాసనసభ్యు లు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవిత్ర మైన యోగా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసన చేసి ఆరోగ్యవంతంగా జీవించాలని అన్నారు.

రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం గత నెల రోజుల నుండి యోగాపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు. ఈరోజు వేల మందితో యోగా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, డిఎస్పీలు ఆర్.జయసూర్య, డా.జి.శ్రీవేద, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, జిల్లా టూరిజం అధికారి ఏ.వి.అప్పారావు, అంతర్జాతీయ యోగా టీచరు టి.శిరీష, డియన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంటు గాదిరాజు సత్యనారాయణ రాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగు కళాశాల, శ్రీ విష్ణు ఇంజనీరింగు కళాశాల, భారతీయవిద్యా భవన్, నారాయణ జూనియర్ కళాశాల, చైతన్య, ఆదిత్య, భాష్యం విద్యాసంస్థలు ఇతర విద్యాసంస్థల ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొన్నారు.