రేపు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో రాష్ట్రస్థాయి మెగా యోగ ఈవెంట్ నిర్వహణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
అధికారులు ఏర్పాట్లను పకడ్బందిగా పూర్తి చేయాలి..
సుమారు 6 వేలు మంది పాల్గొనే లక్ష్యంగా అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్ తో యోగా ప్రదర్శన, ప్రాంగణం చుట్టూ 10 ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు
యోగాలో పాల్గొననున్న జిల్లాలోలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉపసభాపతి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు
రేపు 19వ తేదీన భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో నిర్వహించునున్న రాష్ట్రస్థాయి యోగా ప్రదర్శన విజయవంతానికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రేపు 19వ తేదీ యోగ ఏర్పాట్లపై విధులను అప్పగించిన అధికారులతో సమీక్షించి, పలు ఆదేశాలను జారీ చేశారు. త్రాగునీటి ఏర్పాట్లు పక్కగా ఉండాలని, మెడికల్ సిబ్బంది అవసరమైన మందులతో సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని, బస్సులు పార్కింగ్ ను నిర్దేశించిన ప్రదేశంలో ఉంచేలా చూడాలన్నారు. యోగ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, అధికారులు, పత్రికా ప్రతినిధులు, తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లకు తావులేని విధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, భీమవరం డిఎస్పి ఆర్.జి జయ సూర్య, విధులు కేటాయించిన అధికారులు, తహసీల్దారులు, తదితరులు పాల్గొన్నారు.