Close

యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పర్యాటక ప్రాంతంలో యోగా పేరిట పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం/కేపీ పాలెం బీచ్ లో నిర్వహించిన యోగాసనాలతో సందడి నెలకొంది..

Publish Date : 16/06/2025

పశ్చిమ సాగర తీరంలో సాయం సంధ్య వేళ పచ్చని కొబ్బరి చెట్లు కనువిందు చేస్తుంటే.. పడి లేచే కెరటాల మాదిరిగా యోగాభ్యసనాలు శోభాయ మానంగా సాగాయి…

పకృతి ప్రసాదించిన సంగీతంలా సముద్రపు హోరు లయబద్ధంగా వినిపిస్తుంటే యోగా అభ్యాసకులలో నూతన ఉత్సాహం ఉరకలు వేసింది

అందరికీ ఆరోగ్యం – యోగాతో సాధ్యం..

ప్రతి ఆసనం ఆరోగ్యప్రదాయిని

.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
.. శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్

యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారితే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుందని, ప్రతి ఆసనం ఆరోగ్యప్రదాయిని అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమం పేరిట సోమవారం మొగల్తూరు మండలం పేరుపాలెం/కేపీ పాలెం సముద్ర తీరాన సాయంకాల సంధ్యా సమయంలో జిల్లా రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగఅభ్యసన కార్యక్రమంలో పట్టణ ప్రజలు, విద్యార్థి, విద్యార్థులు, అన్ని శాఖల అధికారులతో ఇంటర్నేషనల్ యోగ టీచర్ టి.శిరీష, యోగా మాస్టర్ ట్రైనర్లు యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో యోగాసనాలపై అవగాహన, శిక్షణ ఇవ్వడం జరిగింది జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, నరసాపురం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరై యోగాసనాలు వేసి అందరిలో స్ఫూర్తిని నింపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. దేశ ప్రధాని పిలుపు మేరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సూచనలతో యోగాసనాలను ఉత్సాహంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. యోగా సాధనతో మానసిక సమస్యలకు, శారీరక రుగ్మతల నుండి విముక్తి లభిస్తుందన్నారు. ప్రతి ఆసనం ఆరోగ్యప్రదాయని అని, బిపి షుగర్, కిడ్నీ, కీళ్ల వాపులు వంటి అనేక వ్యాధులకు ఆసనాల ద్వారా స్వస్తి పలకవచ్చు అన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, డివిజన్, జిల్లాలోని 4,835 ప్రాంతాలలో గత 20 రోజులుగా యోగ అభ్యసన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. యోగా ఆసనాలు వేయడం ద్వారా క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు. మానసిక సమతుల్యత లేని సమాజాన్ని యోగా సరి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఉద్యోగాలు, పనులలో ఒత్తిడికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మానసిక ఒత్తిడి నుంచి ప్రజలను యోగా విముక్తి కల్పిస్తుందన్నారు. నాణ్యమైన జీవితం యోగాతోనే సాధ్యమన్నారు. నాచురోపతి యోగా జీవితంలో ఒక భాగం కావాలన్నారు. యోగాసనాలతో కలిగే ప్రయోజనాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఎలాంటి ఖర్చు, మందులు లేకుండా రోగాలు నివారించడం యోగాతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని కోరారు.

నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నరసాపురం పేరుపాలెం బీచ్ లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. నెలరోజుల పాటు యోగేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ప్రధానమంత్రి పిలుపుమేరకు, మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచనలతో రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత నెల 27వ తేదీన వశిష్ట గోదావరి వలందల రేవు నందు ఎంతో గొప్పగా యోగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతంలో నేడు యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని కోరారు. నేడు గడుపుతున్న యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా ఎంతో అవసరం అని తెలిపారు. యోగ ఈ నెల రోజులే కాకుండా నిరంతరాయంగా సాధన చేసి ఆరోగ్యానికి పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అడిషనల్ ఎస్పి వి.భీమారావు, ఆర్డిఓ దాసిరాజు, డి.ఎస్.పి డాక్టర్ శ్రీ వేద, ఇంటర్నేషనల్ యోగ టీచర్ టి.శిరీష, ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ ఏ హరి శ్రీనివాస్, కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.శ్రీరామ్, మాస్టర్ ట్రైనర్లు పి రోహిణి, యు. వెంకట రామరాజు, అనంతలక్ష్మి, స్థానిక నాయకులు పోత్తూరు రామరాజు, పేరుపాలెం, కేపీ పాలెం సర్పంచులు తిరుమాని విజయలక్ష్మి, అందే వెంకటలక్ష్మి, తహసిల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వర్ణాంధ్ర, వై ఎన్ కాలేజ్, సూర్య కాలేజీల విద్యార్థులు, గౌతమి, వివేక పాఠశాలల విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

5.11 5.22 5.33