జూన్ 19న భీమవరంలో రాష్ట్రస్థాయి సన్నద్ధత సామూహిక యోగా కార్యక్రమం ..
బివి రాజు కళాశాలలో ఏర్పాట్లు పరిశీలన
హాజరుకానున్న 5వేల మంది అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, యువత, తదితరులు..
.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతీ జిల్లాకు ఒక థీమ్‌ను ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఈ నెల 19వ తేదీన భీమవరం విష్ణు కాలేజీ ప్రాంగణం నందు సుమారు 5వేల మంది అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, యువత యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు నెల 19వ తేదీన భీమవరం విష్ణు కాలేజీ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి సన్నద్ధత సామూహిక యోగా కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం భీమవరం విష్ణు కాలేజీ ప్రాంగణంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలించి, వాటిలో చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా గత నెల 21 నుంచి ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. యోగా ప్రాశస్త్యాన్ని వివరించడం, దీనివల్ల కలిగే ప్రయోజనాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. విష్ణు కాలేజీ ప్రాంగణంలోని నాలుగు ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమానికి అధికారులు భారీ ఏర్పాట్లకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు అవుతారన్నారు.
ఏర్పాట్లు పరిశీలన సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఏవి అప్పారావు, జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు, తహసిల్దార్ బాబు రాంబాబు, సహాయం మున్సిపల్ కమిషనర్ ఏ.రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ త్రినాధ రావు, టౌన్ సర్వేయర్ ఎస్.రమాబాయి, డి ఎస్ డబ్ల్యూ ఓ , విష్ణు కాలేజ్ ప్రిన్సిపాల్ ఐ.ఆర్.కే రాజు, ఉమెన్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటరామరాజు, కోఆర్డినేటర్ ఎం.రమేష్ కుమార్, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల లైజనింగ్ మేనేజర్ జి ఎల్ వి కృష్ణంరాజు, కన్స్ట్రక్షన్ ఇంజనీర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
