Close

విభిన్న ప్రతిభావంతులు సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలి .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 16/06/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా రూ.2.88 లక్షల విలువగల ల్యాప్ ట్యాప్ లను ఉచితంగా అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులైన ఎనిమిది మంది ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ కోర్స్ లు చదువుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దివ్యాంగులకు విద్యా మరియు సాంకేతికతను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ద్వారా ల్యాప్ టాప్ లను అందజేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా దివ్యాంగులకు విద్యా మరియు సాంకేతికతను అందుబాటులోకి తేవటం జరుగుతుందన్నారు. ఈ ల్యాప్టాప్ లు వారికి విద్యను అభ్యసించుటలో నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటు సమాజంలో మరింత చురుకుగా పాల్గొనుటకు సహాయపడతాయని అన్నారు. సామాజిక సమానత్వ దిశగా దివ్యాంగులు కూడా సమాన అవకాశాలు పొంది తమ జీవితాలను మెరుగుపరుచు కోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.

ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు దేనిలోనూ తక్కువ కాదని వారి యొక్క ప్రతిభను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

3.11  3.22