జిల్లాలో 8.50 లక్షల మంది యోగ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు
శనివారం కాళ్ల మండలం పెద్దఅమిరం రాధాకృష్ణ కన్వెన్షన్ నందు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగబ్యాసన కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, యోగ శిక్షకులు ఇచ్చిన యోగ అభ్యాసన కార్యక్రమంలో పాల్గొని యోగబ్యాసాలను చేశారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని దీనికి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా యంత్రాంగం కృషి ఎంతగానో ఉందని అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజీగా తీసుకుని యోగాంధ్ర పేరుతో మన రాష్ట్రంలో నెలరోజులు పాటు యోగ కార్యక్రమాలను నిర్వహించుకోవడం అభినందనీయం అన్నారు. యోగాఅభ్యసనాలు ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు మనం చేస్తున్న వృత్తిలో మంచి విజయాలను సాధించవచ్చునని అన్నారు. యోగా ఒక రోజు కార్యక్రమం కాదని నిరంతరం ప్రక్రియ అని ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకుని యోగా ఆసనాలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలని అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన విశాఖపట్నం కార్యక్రమంలో మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొనుట శుభపరిణామం అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మే 21వ తేదీ నుండి యోగా అభ్యసన కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో భాగంగా జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి సారధ్యంలో జిల్లాలో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో యోగాఅభ్యాసన కార్యక్రమాలు ప్రతిరోజు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో 8 లక్షల 50 వేల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్టరు చేసుకోవడం అభినందనీయం అన్నారు. జూన్ 21వ తేదీన జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసి మన పశ్చిమగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యోగాను రోజువారి దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రావు అన్నారు. ప్రతి ఒక్కరు ఒక యోగ ప్రాధాన్యతను తెలుసుకొని అనుసరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ మండల జిల్లా స్థాయిలో మే 21 నుంచి యోగ అభ్యాసాలలో పాల్గొంటున్న జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు జూన్ 21 న జరిగే 2025 యోగాంధ్ర కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా లోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలు, పిల్లలు యోగా దైవానందిక జీవితంలో ప్రతిరోజు జరిగే యోగాబ్యాసాలలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందన్నారు. యోగ అభ్యసనలో పాల్గొన్న వారందరూ కూడా జీవితంలో మంచి ఫలితాలను పొందుతారని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు. అనంతరం కాళ్ల మండలం బొండాడ జడ్పీహెచ్ హై స్కూల్ విద్యార్థులు చేసిన యోగ అభ్యాసనాలలో సూర్య నమస్కారాలను శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు తిలకించి విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా టూరిజం శాఖ అధికారి ఏ అప్పారావు, యోగ డెమోలు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, పి.రోహిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.