Close

జిల్లాలోని కాలువలు, చెరువులు, గట్లు ఆక్రమణలను గుర్తించి తొలగించుటకు కార్య చరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు

Publish Date : 13/06/2025

శుక్రవారం కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో వాచ్ డాగ్ కమిటీ సభ్యులు మరియు రెవిన్యూ డివిజన్ అధికారులతో ఆక్రమణదారుల నుండి కాలువలు, చెరువులు ట్యాంక్ గట్లు రక్షణ కోసం జిల్లాస్థాయి వాచ్ డాగ్ కమిటీ సమీక్ష సమావేశమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,మాట్లాడుతూ సి సి ఎల్ ఏ చీఫ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని చెరువులు, కాలువలు గట్లపైన గల ఆక్రమణలు గుర్తించి తొలగించుటకు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో ఫ్యాక్టరీలు, చిన్న తరహా పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారాలు, సెప్టిక్ ట్యాంకులు వలన మంచినీటి కాలువలు, చెరువులు కలుషితంమయ్యే ప్రదేశాలను గుర్తించి తొలగించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 6,892 అక్రమణలకు గాను రెవిన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన 350.38 ఎకరాలు ఆక్రమణలను గుర్తించడం జరిగిందని అన్నారు. ఈ నెలాఖరు నాటికి ఆక్రమణలను పూర్తిస్థాయిలో గుర్తించాలని, ఆయా శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జూలై నెల నుండి మూడు నెలల కాలంలో జిల్లాలో ఆక్రమణలన్నీ తొలగించే చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలువలు చెరువులు ఏ ప్రదేశంలో పొల్యూషన్ కు గురవుతున్నాయో గుర్తించి సంబంధిత శాఖలకు తెలియజేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారికి సూచించారు. మున్సిపల్, పంచాయతీ శాఖలు సంబంధించిన ఆక్రమణలు ఆయా శాఖలు తొలగించే చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్ కి సంబంధించిన ఆక్రమణలను సంబంధిత తహసిల్దార్ ద్వారా తొలగించే కార్యక్రమము చేపట్టాలని అన్నారు. ఈ కార్యచరణకు సంబంధించి ప్రతి నెల నాలుగో శనివారం సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, ఏసీబీ శ్రీలక్ష్మి, కలెక్టరేట్ ల్యాండ్ సూపర్డెంట్ సిహెచ్ రవికుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎనాలిస్ట్ తేజస్వి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు మున్సిపల్ కమిషనర్లు, రామచంద్రారెడ్డి, ఎం ఏసుబాబు, టి.రామ్ కుమార్, బి విజయ సారథి, ఎం.జి కృష్ణమోహన్, మున్సిపల్, ఇరిగేషన్, డ్రైన్స్, డి ఈ లు, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.