జిల్లాలో క్షయ వ్యాధిని అంతం చేయడమే లక్ష్యంగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం పెనుగొండ మండలం సిద్ధాంతం టిబి యూనిట్ నందు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “ప్రధానమంత్రి ఇంటెన్సిఫైడ్ టీబి ముక్త్ భారత్ క్యాంపెయిన్” ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి టీవీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా 60 సంవత్సరాల పైబడిన వారు, షుగర్ పేషెంట్స్, రోగానిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఆల్కహాల్ తీసుకునేవారు, స్మోకర్స్, గతంలో టీబీ వ్యాధి బారిన పడినవారు, టిబీ వ్యాది గ్రాస్తుల ఇళ్లలో వున్నవారు వీరంతా పరీక్షలు చేయించుకోవాలని, మన దేశాన్ని క్షయ వ్యాది లేని దేశంగా తీర్చిదిదాలని కోరారు. ప్రధానమంత్రి టీవీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరు ఎవరైనా సరే టీబీ పేషెంట్లకు పౌష్టిక ఆహారాన్ని అందజేయడానికి దత్తతు తీసుకోవచ్చని, దీనికి తొలుత “నిక్షయమిత్ర” గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. టీబీ పేషెంట్లకు పౌష్టికాహార నిమిత్తం నెలకు 600 రూపాయల విలువగల పౌష్టికాహార సరుకులు ఇచ్చి నిక్షయమిత్రగా నిలవాలని కోరారు. దీనిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ నిక్షయమిత్రాగా రిజిస్టర్ అయి 25 మంది పేషంట్లను దత్తత తీసుకోవడం జరిగింది. గుర్తించిన 25 మందికి ఈరోజు ఫుడ్ బాస్కెట్స్ జిల్లా కలెక్టర్ అందజేయడం జరిగింది. ఇండస్ట్రియల్ లిస్టులు, స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు కూడా నిక్షయమిత్రగా ఉండాలని టీబీ పేషెంట్ల యొక్క ఆరోగ్యం మెరుగుపడేటట్టుగా సహకరించాలని కోరారు.
చివరిగా జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న 25 మంది క్షయరోగుల పౌష్టికాహార ఖర్చుకు సంబంధించిన చెక్కును డిప్యూటీ డిఎంహెచ్ఓకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్వో జి.గీత బాయి, అడిసినల్ డిఎం&హెచ్వో డాక్టర్ బి.భాను నాయక్, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, పంచాయతీ ప్రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సుప్రియ, డాక్టర్ సత్య, తదితరులు పాల్గొన్నారు.