ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక 1100 మీకోసం కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు నమోదు, ఫిర్యాదుల వివరాలు తెలుసుకొవచ్చు.
సోమవారం జూన్ 2న నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, డివిజనల్, మండల, మున్సిపల్ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరిస్తారు
జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ఐ.ఎ.ఎస్
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ జూన్ 2 సోమవారం జిల్లా స్థాయితో పాటు డివిజనల్, మండల, మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి తెలిపారు.
“ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు.
అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు. అదే విధంగా అర్జీదారులు యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam. ap.gov.in వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చును. అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చని కూడా తెలియజేసారు.