Close

ప్రాధాన్యతగా ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Publish Date : 29/05/2025

గురువారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మ్యాన్యువల్ స్కావెంజర్ నిషేధ మరియు పునరావాస చట్టంకు సంబంధించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు జయ రామ కృష్ణ, బొత్స లక్ష్మీ దుర్గ, జిల్లెల సత్య సుధామ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మ్యాన్యువల్ స్కాంజెర్ కుటుంబ సభ్యులకు మెరుగైన అవకాశాలను కల్పించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ లేరని, గతంలో స్కావెంజర్స్ గా పనిచేసిన కుటుంబాల పిల్లలకు అవసరమైన ఉపాధి అవకాశాలకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఆయా కుటుంబాల్లో ఎవరైనా చదువుకున్న వారు ఉంటే జాబ్ మేళాల ద్వారా తగిన ఉద్యోగాలు అందించడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలలో పోరుగు సేవల విధానంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబంలో ఉన్నవారికి తప్పనిసరిగా అవకాశం కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సెప్టిక్ ట్యాంక్ పైపులను డైరెక్ట్ గా డ్రైనేజీల్లో కలిపితే క్రిమినల్ చర్యలు ఉంటాయని, ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

సభ్యులు జయ రామ కృష్ణ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం బైపాస్ ఏర్పాట్లు కొంతమంది స్కావెంజర్స్ కుటుంబాలు ఇళ్లను కోల్పోయారని, ఒక 20 ఫ్యామిలీలు బైపాస్ పక్కన నివసిస్తున్నారని వారందరికీ ఇళ్ల స్థలాలను ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో స్కావెంజర్స్ కాలనీలు ఎక్కడ ఉన్నా గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు అత్యంత ప్రాధాన్యతగా ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారిని ఆదేశించారు.

ఈ సమావేశంలో డి ఎస్ డబ్ల్యు ఓ బి వి ఎస్ బి రామాంజనేయ రాజు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.పుష్ప రాణి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, డి ఎల్ డి ఓ వై దోసి రెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, డిస్టిక్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు జయ రామ కృష్ణ, బొత్స లక్ష్మీ దుర్గ, జిల్లెల్ల సత్య సుధామ, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, ఆకివీడు మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.