Close

వశిష్టగోదావరిలో పడవల మీద, సాగర సంగమం వద్ద యోగాభ్యాసంలో ప్రభుత్వ విఫ్, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డి,డిఆర్వో యం.వెంకటేశ్వర్లు సంయుక్తంగా పాల్గొని యోగా ఆసనాలు చేశారు …

Publish Date : 27/05/2025

వశిష్ఠ గోదావరి అందాలు, పకృతి సౌందర్యాలు యోగా అభ్యాసన మంచి సందేశం, చక్కని స్పూర్తి.

వశిష్ఠ గోదావరిలో రెండు పడవలలో యోగా అభ్యసన కార్యక్రమం పెద్ద హైలెట్.

యోగాను క్రమం తప్పకుండా సాధనచేస్తే ఆరోగ్యానికి బంగారుబాట.

జూన్ 21వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి.

 

మంగళవారం స్థానిక వశిష్ట గోదావరిలో పడవులు, వలందర రేవు వద్ద యోగాభ్యాసంలో పాల్గొని ప్రభుత్వ విఫ్, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్,జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా అందరితో కలిసి యోగా ఆసనాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విఫ్, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఛాలెంజిగా తీసుకుందని అందుకు అనుగుణంగా విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుతో యోగాంధ్ర కార్యక్రమాలు కన్నులు పండుగగా జరుగుతున్నాయన్నారు. కరోనా వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఎంతో మంది వీధిన పడ్డారని అన్నారు. యోగా కార్యక్రమాలు వలన మానవునికి చక్కని ఆరోగ్యం, దేహాదారుఢ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మన భారత ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పాల్గొనుట శుభపరిణామం అన్నారు. వశిష్ట గోదావరి మహా పుణ్యక్షేత్రం అని, యోగా అభ్యాసన కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. యోగాను క్రమం తప్పకుండా సాధనచేస్తే శారీరక, మానసిక, భావోధ్వేగ శ్రేయస్సును సాధించడానికి దోహద పడుతుందన్నారు. వశిష్ట గోదావరి పడవల మీద,గట్టున యోగా అభ్యాసన కార్యక్రమంలో పాల్గొనుట అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జీవితంలో మంచి తీపి జ్ఞాపకంగా పదిలంగా ఉంటాయని అన్నారు.మనతో పాటు మరో ముగ్గురిని యోగా అభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేలా చూడవలసిన సామాజిక బాధ్యతను తీసుకోవాలన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు పర్యాటక కేంద్రాలు, మహా పుణ్యక్షేత్రాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చి యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తామని ప్రభుత్వ విఫ్ బొమ్మిడి నాయకర్ అన్నారు.

జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టూరిజం ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమాలు చేసుకుంటే అంతర్జాతీయ గుర్తింపు, స్ఫూర్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. వశిష్ఠగోదావరి సాగర తీరంలో యోగా అభ్యాసన కార్యక్రమం జరుపుట ముఖ్య ఉద్దేశం అన్నారు. వశిష్ట గోదావరి అందాలను, పకృతి సౌందర్యాలను చూపించడం ఆ ఫొటోస్, వీడియోలు, కవరేజీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు చేరాలని అన్నారు. మీడియా సోదరులు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని, యోగాంధ్ర కార్యక్రమాలు మారుమూల పల్లెల సయితం మంచి స్ఫూర్తిని అవగాహన పెంపొందించాలని ఈ సందర్భంగా మీడియా సోదరులను కోరారు. అందరీకి మంచి స్పూర్తి ,మంచి సందేశాన్ని అందించిన వాళ్ళము అవుతామని అన్నారు.వశిష్ఠ గోదావరిలో రెండు పడవలలో యోగా అభ్యాసన కార్యక్రమం పెద్ద హైలెట్ గా నిలిచిందన్నారు. యోగా ఒక్కరోజు కార్యక్రమం కాదని నిరంతర ప్రక్రియ అని ప్రతి రోజు కొంత సమయం కేటాయించి సాధనచేయడం వల్ల హృదయ సంబంధ ఫిట్ నెస్ పెరగడం, రక్తపోటు సాధారణీకరణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయన్నారు. అధికారులు, ఉద్యోగులు యోగాను చేసుకుంటే ఒత్తిడిని నియంత్రించు వచ్చునని, చేస్తున్న వృత్తిలో మంచి ఫలితాలు సాధించి సంతృప్తిని పొందవచ్చునన్నారు.ఇందులో భాగంగా ఈరోజు వశిష్ట గోదావరి వలందర రేవు వద్ద ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా యోగాభ్యాసం కార్యక్రమం విజయవంతం అగుట శుభ పరిణామం అన్నారు. 27వ తేదీ (ఈ రోజు) వశిష్ట గోదావరి వలందర రేవులో జరుపుకున్నామని, జూన్ 03 వ తేదీ పెనుగొండ అమ్మవారి దేవస్థానం, 09వ తేదీ మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్,16వ తేదీ భీమవరం అల్లూరి సీతారామ రాజు స్మృతి వనం, 19వ తేదీ భీమవరం డియన్ఆర్ కాలేజీ, నరసాపురం వైయన్ యం కళాశాలలో 5 వేలు మందితో యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు.

ఈ యోగా అభ్యాసన కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో దాసిరాజు, డియస్పి డా.జి.శ్రీ వేద, ట్రైనీ డియస్పి కె.మానస, జిల్లా టూరిజం అధికారి ఏ.వి.అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ఆయుష్ జిల్లా అధికారి డా.ఏ.హరి శ్రీనివాసు, కో-ఆర్డినేటరు డా.ఏ.శ్రీరామ్, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటరు డా.కె.కీర్తి కిరణ్, మున్సిపల్ కమీషనరు బి.అంజయ్య, తహశీల్దారు అయితం సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, మున్సిపల్ కౌన్సిలర్సు, యోగా ట్రైనర్సు కలిగొట్ల గోపాలశర్మ, పి.యస్.డి. భవాని, యం. గోవింద రావు, ఏ.సునీత, మోహన్ కృష్ణ, విజయ, అనంత లక్ష్మీ,రోహిణి, వ్యాఖ్యాత చక్రాఅవధానులు రెడ్డప దవేజి, పట్టణ ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

1.44 1.11 1.22 1.25