Close

జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పశ్చిమగోదావరి జిల్లా నుండి పెద్ద ఎత్తున రిజిస్టర్ కావాలి

Publish Date : 24/05/2025

క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్సైట్ లింక్ ద్వారా ప్రతి ఒక్కరూ నమోదు కావాలి.

జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి …

జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరి భాగస్వామ్యం పెద్ద ఎత్తున కావాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్ ద్వారా ప్రతి ఒక్కరూ నమోదు కావాలని సూచించారు. నమోదు చేసుకున్న వారు ఏ కారణం చేతనైనను యోగా రోజున పాల్గొన లేకపోయినా ఇబ్బంది లేదన్నారు. జూన్ 21వ తేదీన మీ సమీపాన ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వద్ద, తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాల వద్ద పాల్గొనవచ్చునని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు భాగస్వామ్యం పెద్ద ఎత్తున కావాలనే ధ్యేయంతో క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ నమోదు కావాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇంటర్నేషనల్ యోగలో పాల్గొనేందుకు లింకు ద్వారా నమోదు కావాలని సూచించారు https://yogandhra. ap.gov.in/#/home/launchone ముందుగా పై లింక్ ఓపెన్ చేయాలని, తదుపరి స్క్రీన్ లో కింద ఉన్న లాంచ్ క్లిక్ చేయాలని, తదుపరి స్క్రీన్ లో పైన ఉన్న రిజిస్టర్ క్లిక్ చేయాలన్నారు. తదుపరి స్క్రీన్ లో ఈ క్రింది వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, చివరగా ఓటీపీతో కన్ఫర్మ్ చేయాలని వివరించారు. నమోదుకు మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ, చిరునామాలను పొందుపరచాలని సూచించారు.