Close

మే 25న జిల్లా కలెక్టరేటు క్రీడా మైదానంలో 500 మంది వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పట్టణ, ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులతో యోగ ప్రాక్టీస్ సెషన్ నిర్వహణ–జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి …

Publish Date : 23/05/2025

జూన్ 19వ తేదీన స్థానిక డియన్ ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో 5 వేల మందితో భారీ యోగా ప్రాక్టీసు కార్యక్రమానికి శ్రీకారం

జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

యోగాంధ్ర 2025పై గ్రామ, మండల,జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

శుక్రవారం జిల్లా కలెక్టరేటు వశిష్ఠ కాన్ఫరెన్స్ హల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేదీన జరిగే కార్యక్రమం విజయవంతంపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో యోగాంధ్ర 2025 మాసోత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులకు జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ యోగా దినోత్సవానికి మూడు రోజులు ముందుగా జూన్ 19వ తేదీన స్థానిక డియన్ ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో 5 వేల మందితో భారీ యోగా ప్రాక్టీసు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులను హాజరు అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే 25వ తేదీ ఆదివారం జిల్లా కలెక్టరేటు క్రీడా మైదానంలో 500 మంది వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పట్టణ, ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులతో యోగ ప్రాక్టీస్ సెషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 21 తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. జూన్ 21 తేదీన విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మన జిల్లాలోని గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో ఫిజికల్ డైరెక్టర్లు, పిఇటి లు, యోగా టీచర్లు యోగ క్లాసులకు ట్రైనర్సు గా ఉండాలని, యోగా సర్టిఫికెట్లు ఉన్నవారు మాస్టర్స్ ట్రైనర్సుగా శిక్షణ ఇవ్వాలని అన్నారు. జిల్లాకు 400 నుండి 500 వరకు ట్రైనర్సు కావాలని, వీటిలో మాస్టర్స్ ట్రైనర్సు 100 మంది దాకా అవసరం ఉంటుందని అన్నారు. వీరితో పాటు అవసరమైతే సచివాలయం సిబ్బందికి శిక్షణ ఇచ్చి యోగ శిక్షణ కార్యక్రమాలకు వినియోగించాలని అన్నారు. గ్రామ, మండల, జిల్లా యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంపొందించాలని అన్నారు. దీనికోసం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగ అవగాహన పోటీలు వ్యాచరచన, పోస్టర్లు, పెయింటింగు, క్విజ్, పాటలు, సూర్య నమస్కారాలు తదితర 13 రకాలు అవగాహన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంశా పత్రాలు అందజేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు, విద్యా, స‌చివాల‌య‌, టూరిజం, క్రీడా,ఆయూష్ త‌దిత‌ర ప్ర‌ముఖ శాఖ‌ల కీల‌క భాగ‌స్వామ్యం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అందుకోసం ప్ర‌త్యేక వెబ్ సైట్, యాప్ రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చామని రిజిస్ట్రేష‌ను ప్ర‌క్రియ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి కార్యాలయంలో అధికారి నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు రిజిస్ట్రేషను అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్ర‌జ‌లంతా ఈ నెల రోజులు జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం కావాల‌ని, అంత‌ర్జాతీయ యోగా వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌న్నారు. అంద‌రూ యోగా ఆవ‌శ్య‌క‌త‌ను తెలుసుకునేలా అవగాహన పెంచాలని అన్నారు. ప్ర‌జ‌లు, వివిధ సంస్థ‌లు, మీడియా స‌హ‌కారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు యోగా మంత్ లో భాగంగా శిక్ష‌ణ‌లు, ప్ర‌త్యేక యోగాలు నిర్వ‌హించి, స్వ‌ర్ణాంధ్ర లక్ష్యాల్లో భాగంగా హెల్దీ, హ్యీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు శ్రీకారం చుట్టాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ విభాగ అధికారి డాక్టరు ఏ.హరి శ్రీనివాసు, ఆయుష్ కో- ఆర్డినేటరు డాక్టరు ఏ.శ్రీరామ్, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ,జిల్లా టూరిజం అధికారి ఏ.వి.అప్పారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యం.రాజేష్,ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.