కొల్లేరు ఎకో జోన్ నిర్ధారణపై గ్రామసభల ద్వారా అందిన విజ్ఞాపనలను పరిశీలించి, సంబంధిత పరిధిలోని ప్రజలకు ఏకోజోన్ ఏర్పాటుపై అవగాహన కల్పించి తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు…
శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఎకో సెన్సిటివ్ జోన్ నిర్ధారణపై గ్రామ సభల ద్వారా అందిన అభిప్రాయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు కొల్లేరు నుండి పది కిలోమీటర్ల వరకు ఈ.ఎస్.జెడ్ (ఎకో సెన్సిటివ్ జోన్) నిర్ధారించాల్సి ఉందన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో గల ఐదు మండలాలలోని 31 గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన గ్రామసభలలోని అర్జీలను పరిశీలించి, ఏకోజోన్ ఏర్పాటుపై వారి సందేహాలను నివృత్తి చేసి తిరిగి అభిప్రాయాలు స్వీకరించాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామసభలు అనుసరించి వాటిలో ప్రజల నుండి వచ్చిన వినతులను బట్టి సంబంధించిన శాఖల వారి, గ్రామసభల్లో ప్రజలు ఏమైతే ప్రస్తావించారో వారికి ఇంకా విపులముగా, అర్థమయ్యేలా ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. తదుపరి సమావేశమునకు గ్రౌండ్ లెవెల్ లో ఈ ఎస్ జెడ్ పై ప్రజలకు ఉన్న సందేహాలు నివృత్తి చేసి,వారి యొక్క సూచనలు, ఇబ్బందులు తెలుసుకుని రిపోర్టు రూపంగా సమర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులను ఆదేశించారు. తదుపరి సమావేశం నకు సంబంధిత శాఖల జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో నిర్వహించి అనంతరం తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా డిఎఫ్ఓ ఆశా కిరణ్, ఏలూరు వైల్డ్ లైఫ్ డి ఎఫ్ ఓ బి.విజయ, ఇంచార్జ్ డిపిఓ వై.దోసి రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, జిల్లా మత్స్య శాఖ అధికారి కె.ఎస్.వి నాగలింగచార్యులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కె.మురళీకృష్ణ, జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఏ.రఘునాథ్ బాబు, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి కె.గంగాధర్ రావు, డ్రైన్స్ ఈ ఈ సి.హెచ్ సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజ్ అధికారి కె.వి.రామలింగా చార్యులు, ఆకివీడు, గణపవరం కాళ్ల, ఉండి, పెంటపాడు,మండలాల తాసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.