Close

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రస్థాయి అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అభినందనలు..

Publish Date : 14/05/2025

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మే 8న రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న సందర్భంగా బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని తణుకు నియోజకవర్గం శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ కలిసి శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మానవతా సేవల్లో చూపిన విశేష కృషికి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ నాగరాణి రెడ్ క్రాస్ రాష్ట్ర అవార్డు పొందటం పశ్చిమగోదావరి జిల్లా వాసులకు గర్వకారణం అన్నారు. వరదల సమయంలో కలెక్టర్ నాగరాణి స్వయంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణ సహాయం అందించడంలో ఆమె తీసుకున్న చొరవ అభినందనీయం అన్నారు. ఈ అవార్డు ఆమె సేవాభావానికి, మానవతా కార్యక్రమాలపైన ఉన్న నిబద్ధతకు గుర్తింపుగా నిలుస్తోంది అన్నారు.