Close

రాష్ట్ర ప్రభుత్వ ఈ గవర్నన్స్ వాట్సప్ సేవలకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 12/05/2025

రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఈ గవర్నన్స్ వాట్సప్ సేవలు విస్తృత అవగాహనకు రూపొందించిన మనమిత్ర స్టాండిలను సోమవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ గవర్నన్స్ వాట్సప్ సేవలు అంటే ఏమిటి, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రయోజనాలేంటి, తదితర విషయాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా గ్రామ,వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి ని ఆదేశించారు. జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాలకు, ఎంపీడీవో కార్యాలయాలకు, మున్సిపాలిటీలకు “మనమిత్ర” స్టాండిలను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు స్పష్టంగా కనిపించేలా “మనమిత్ర” స్టాండిలను ప్రదర్శించాలని ఆదేశించారు. మనమిత్ర స్టాండ్లను జిల్లాలోని అన్ని ప్రభుత్వ జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంలో జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై. దోసి రెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఏ.వీ అప్పారావు ఉన్నారు.