భారత సైన్యానికి మనమంతా సంఘటితంగా ఉంటూ సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం.

యుద్ధం ముఖ్యం కాదు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించడమే మన లక్ష్యం
శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు
శనివారం జువ్వలపాలెం రోడ్డులోని అడ్డ వంతెన మూర్తి రాజు విగ్రహం నుండి నుండి టాటా విగ్రహం వరకు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా అధికారులు, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులు సామాన్య ప్రజలను, మిలటరీ అధికారులను పొట్టన పెట్టుకున్నారని ఎంతో శాంతియుతంగా ఉన్నా దాన్ని అలుసుగా తీసుకొని ఇటీవల జరిగిన పెహల్గామ్ దాడిలో మతం పేరుతో 22 మంది పర్యాటకులను విచక్షణారహితంగా కాల్చి చంపారన్నారు. ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని ప్రధానమంత్రి ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రతీకార చర్యలు తీసుకున్నారని, దానికి మనమంతా ప్రధానమంత్రికి, భారత సైన్యానికి తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించడం జరిగిందని. యావత్ ప్రపంచం మనకు మద్దతుగా నిలిచింది అన్నారు. మనకు యుద్ధం ముఖ్యం కాదని సమస్యను శాంతియుతంగా పరిష్కరించడమే మన ఉద్దేశం అన్నారు. ఇంకా యుద్ధం మొదలు కాలేదని ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే విజయం మనదే అన్నారు. భారత సైన్యానికి మనోధైర్యం కల్పించడానికి భీమవరం, ఉండి నియోజకవర్గాల స్థాయిలో ఈరోజు పెద్ద ఎత్తున సమైక్యత ర్యాలీ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఇటువంటి ర్యాలీలు భవిష్యత్తులో నిర్వహించడం జరుగుతుందన్నారు. హిందూ, ముస్లింలు అనే బేధ భావం లేదన్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో యావత్ భారతదేశం సైన్యానికి అండగా ఉన్నామన్న ధైర్యాన్నిద్దామన్నారు. ఈ సందర్భంగా వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మనమందరం భారతీయులం, భారతదేశంపై ఎటువంటి దాడులు జరిగిన ఉపేక్షించేది లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతమొందించాలని, ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కి మద్దతు ఇవ్వాలన్నారు.
ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ వి.భీమరావు, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖ, ఎమ్మెల్సీ గోపి మూర్తి ,వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.