Close

ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది అని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Publish Date : 08/05/2025

గురువారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉండి మత్స్య పరిశోధన కేంద్రంలో ఆక్వా సాగులో సాంకేతిక అనుకరణలు, యాజమాన్యం పద్ధతులు అంశంపై రైతులకు జరుగుచున్న మూడు రోజులు శిక్షణా తరగతులు ముగింపు కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతో అధిక ఉత్పత్తులు సాధించవచ్చునని అన్నారు. ఆక్వా సాగులో మంచి క్వాలిటీతో ఉత్పత్తిని పెంపొందించడానికి, రైతులు కొత్త టెక్నాలజీ పద్ధతులను తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆక్వా అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా అన్నారు. ఇక్కడ జరిగే సాగు విధానాలను తెలుసుకోవటానికి అనేక ప్రాంతాల నుండి రైతులు రావడం జరుగుతుందని అన్నారు. ఆక్వా రైతులు నూతన సాంకేతిక యంత్రాలను ఉపయోగించి ఉత్పత్తులను పెంచుకోవాలని సూచించారు. ఆక్వా సాగులో మెలుకులను పాటించి సాగు చేయాలని సూచించారు. జిల్లాలో 1.33 లక్షల ఎకరాలకు గాను రిజిస్ట్రేషన్ చేసుకున్నవి 49 వేల ఎకరాలు మాత్రమే అని తెలిపారు. ఆక్వా సాగులో టెక్నాలజీ పెంపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులు మరింత కొత్త పద్ధతులను తెలుసుకు నేందుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ హైదరాబాద్ వారితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు చెప్పారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ద్వారా రైతులు అవగాహన చేసుకుని క్వాలిటీ తో ఉత్పత్తులను పెంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతరం ఆక్వా రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగలింగాచారి,డైరెక్టర్ ఫిషరీస్ అభిషేక్ (బీహార్) ఫిషరీస్ యూనివర్సిటీ ఓ ఎస్ డి డాక్టర్ సుగుణ, ఎం పేడ ఫీల్డ్ ఆఫీసర్ దుర్గారావు, డాక్టర్ చంద్రశేఖర్, చంద్రశేఖర రావు, శ్రీనివాసరావు,పని ప్రకాష్, ఎఫ్ డి వో లు, విలేజి ఫిషరీస్ అసిస్టెంట్లు, ఆక్వా రైతులు, తదితరులు పాల్గొన్నారు.