Close

ప్రస్తుత రబి సాగుకు సంబంధించి జిల్లాలో 263 రైతు సేవా కేంద్రాల ద్వారా 55,983 మంది రైతులు వద్ద నుండి 5.21 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యమును కొనుగోలు

Publish Date : 08/05/2025

రూ.1,200 కోట్లకు గాను రూ.1,130 కోట్లు రైతులు ఖాతాలో డబ్బులు జమ

జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ మరియు గన్ని బ్యాగులు సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2024- 25 సంవత్సరం రబి సాగుకు సంబంధించి జిల్లాలో 263 రైతు సేవా కేంద్రాల ద్వారా 55,983 మంది రైతులు వద్ద నుండి 5.21 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యమును కొనుగోలు చేసి రూ.1,200 కోట్లకు గాను రూ.1,130 కోట్లు రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు రైతుల నుండి సేకరించిన ధాన్యమునకు సంబంధించి ఈరోజుకి రూ.70 కోట్లు మాత్రమే రైతులు ఖాతాల్లో జమ చేయవలసి ఉన్నదని అన్నారు. ప్రస్తుతం రబి సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లర్లకు కేటాయించిన రైతు సేవా కేంద్రాలకు గన్ని బ్యాగులు వేగవంతముగా సరఫరా చేయాలని సూచించారు. మిల్లర్స్ తీసుకున్న దాన్యము త్వరితగతిన మర పట్టించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి కేటాయించిన 50 వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని వారం రోజులో డెలివరీ చేయాలని ఆదేశించారు. దీనికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ డిస్టిక్ మేనేజర్ టి.శివరామ ప్రసాద్, డీఎస్ఓ ఎన్.సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామతం శ్రీరామరాజు, సెక్రటరీ కె.శ్రీనివాస్, తాలూకా అసోసియేషన్ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.