పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రెండు రాష్ట్రస్థాయి రెడ్ క్రాస్ అవార్డులకు ఎంపిక…

విజయవాడ రాజ్ భవన్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఆహ్వానం
మే 8న రాష్ట్ర గవర్నర్ చేతులు మీదుగా అవార్డులను అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
పశ్చిమగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షులు చదలవాడ నాగరాణి అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా 2023-24, 2024-25 సంవత్సరాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రెడ్ క్రాస్ అవార్డులతో సత్కరించడానికి ఎంపిక చేయడం జరిగింది.
దీనిని పురస్కరించుకొని మే 8వ తేదీ ఉదయం 11:00 గంటలకు విజయవాడ రాజ్ భవన్‌లో నిర్వహించే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకలలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ నుండి అవార్డును
అందుకోవాలని కోరుతూ రాజ్ భవన్ నుండి ఆహ్వానాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందుకోవడం జరిగింది.
జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయిలో రెండు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డులను పొందడం ఎంతో సంతోషకరమైన విషయమని జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.