Close

మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిరంతరం రైతులకు సూచనలు ఇస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 06/05/2025

చేపలు, రొయ్యలు సాగులో ఎటువంటి యాంటీ బయటిక్ మందులు వాడరాదు, టెక్నాలజీని ఉపయోగించాలి..

మంగళవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉండి మత్స్య పరిశోధన కేంద్రం నందు ఆక్వా రైతులకు ఆక్వా పద్ధతులు నిర్వహణ మరియు నైపుణ్యం గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వాకల్చర్ లో మంచి యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ జాతులు పెంపకం, అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సాగులో నష్టాలను నివారించటం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి దిగుబడి పెంచుకోవడానికి నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు విధానంలో లోపాల వల్లగాని, వ్యాధులు వల్ల గాని పంట నష్టం పోకుండా సుస్థిర అభివృద్ధి సాధించడం కొరకు నిర్వహిస్తున్న మూడు రోజులు శిక్షణ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని ఆక్వా కల్చర్ సాగు నిర్వహణ మరియు నైపుణ్యం గురించి అవగాహన చేసుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమాల్లో తెలియజేసిన నీటి, మేత యాజమాన్యం పద్ధతులు వంటివి రైతులు అవగాహన చేసుకుని ఆక్వా సాగులో అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మత్స్య శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిరంతరం రైతులకు సూచనలు, సలహాలు ఇస్తూ ఉండాలని, అలాగే తరచు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఎంపెడా అధికారులు, కెవికే శాస్త్రవేత్తలు, సాంకేతిక సంస్థ ప్రతినిధులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆక్వా సాగులో అవలంబించే సాంకేతిక పద్ధతుల గురించి పలు సూచనలు, సలహాలను వివరించారు. అనంతరం రొయ్యలకు మేతను వేయడానికి డ్రోన్ ద్వారా ఉపయోగించే విధానమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కె.ఎస్.వి నాగలింగాచార్యులు, ఫిషరీస్ యూనివర్సిటీ డాక్టర్ సుగుణ, కెవికె సైంటిస్ట్ శ్రీనివాస్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పణి ప్రసాద్, ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్లు, ఎఫ్డిఓలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.