Close

సామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 01/05/2025

మే నెల మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధాప్య, ఒంటరి మహిళల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మానసిక దివ్యాంగులు, తదితరులకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లాస్థాయి కార్యక్రమం గురువారం అత్తిలి మండలం అత్తిలి యానాదుల పుంతలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యానాదుల పుంతలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛనుదారుల గృహాల వద్దకు నేరుగా వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పింఛన్ల లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్ల సొమ్ము సక్రమంగా అందుతుందా, ఏ సమయానికి పింఛన్లు ఇస్తున్నారు, పింఛన్లు మీ గృహం వద్దనే ఇస్తున్నారా, పింఛన్ల పంపిణీ చేసే సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారా? అంటూ లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూసామాజిక భద్రత కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లాలో వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పింఛన్ల పంపిణీ తీరుపై లబ్ధిదారులకు ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించడం జరుగుతుందని, ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పింఛను తీసుకోవడంలో ఎదురైన సమస్యలను కూడా నేరుగా తెలపవచ్చన్నారు. పింఛన్ల పంపిణీలో సచివాలయం సిబ్బంది ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో మే నెలకు 25 రకాల పింఛన్లకు సంబంధించి 2,25,231 మంది పింఛన్దారులకు రూ.96.66 కోట్లు పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు.

ఈ సందర్భంలో కాలనీవాసులకు ప్లాస్టిక్ వినియోగంపై అనర్ధాలను తెలియజేస్తూ, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు.

తొలుత అత్తిలి మండలం మంచిలిలో జిల్లా కలెక్టర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఎంపీడీవో పి.శామ్యూల్, డి ఎల్ డి ఓ ప్రభాకర్, ఈఓపిఆర్డి ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ తహసిల్దార్ యు.వెంకటేశ్వర్లు, ఏపీఓ ఎం.బాబ్జి, సెక్రటరీ జి.భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్, హౌసింగ్ ఎఇ ఎస్.కే.యం షా, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

2.11