Close

జిల్లాలో మే 4న నీట్ యూజీ- 2025 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

Publish Date : 30/04/2025

బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి నీట్‌ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై నీట్ యూజీ అధికారులు, సూపరింటెండెంట్లు, విద్యా శాఖా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రెండు సెంటర్లను తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నిట్ లో ఒక పరీక్ష కేంద్రం, శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షల్లో మొత్తం 2100 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5.00 గంటల వరకు ఆఫ్ లైన్ విధానంలో జరుగుతుందని చెప్పారు. ఉదయం 11.00 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటులు చేయాలని పోలీసు శాఖ వారిని ఆదేశించారు. కస్టోడియన్ బ్యాంకుకు వచ్చిన పరీక్ష పేపర్లను సూపరింటెండెంట్లు, పోలీసు సహకారంతో తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. పోలీసు సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో వీల్ చైర్లను, సహాయకులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ నియమ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలకు హాజరగు అభ్యర్దులు సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేవని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మౌలిక వసతులైన టాయిలెట్స్, త్రాగునీరు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్.టి.సి బస్సులు తగు విధంగా ఉదయము సాయంత్ర వేళల్లో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఏఎన్ఎం, 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గుమికూడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రము సమీపంలో ఎక్కడ కూడా జిరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మహిళా పోలీస్ ను కూడా నియమించాలన్నారు.

తాడేపల్లిగూడెం పరిధిలో రెండు పరీక్ష కేంద్రాలు

1) నిట్ కళాశాలలో ఎస్ ఆర్ కె అకడమిక్ కాంప్లెక్స్, ఎంఎంఎం అకడమిక్ కాంప్లెక్స్.

2) శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో నికోల తెస్లా బిల్డింగ్ బ్లాక్ నెంబర్.22, అలాన్ టూరింగ్ బిల్డింగ్ బ్లాక్ నెంబర్.23.

గూగుల్ మీట్ లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డిఇఓ ఇ. నారాయణ, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శివన్నారాయణ రెడ్డి, పోలీసు డిపార్ట్మెంట్ నోడల్ అధికారులు ఎస్సైలు పి.నాగరాజు, జే వి ఎన్ ప్రసాద్, కే శ్రీనివాస్, ఆర్ బెన్నీ రాజు, సూపరింటెండెంట్స్ డాక్టర్ మాచవరపు రాముడు, డాక్టర్ జె కృష్ణమూర్తి, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ ఆర్ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.