మహిళా సమైక్యలు తయారు చేసే తినుబండారాలు, లేసు ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించే దిశగా అందమైన ప్రింటింగ్ డిజైన్స్ తో బాక్స్ ఐటమ్స్ ను తయారుచేసి అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రింటర్స్ ప్రతినిధులను కోరారు.

మంగళవారం వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందమైన ప్రింటింగ్ డిజైన్స్ తో ప్యాకింగ్ ఉత్పత్తులను తయారు చేసేందుకు డి ఆర్ డి ఏ, ఇండస్ట్రీస్ అధికారులు, ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై చర్చించారు. మంచి మంచి ఉత్పత్తులు తయారు చేయడం ఎంత ముఖ్యమో, మార్కెటింగ్ చేయడానికి ఆకర్షణయంగా ఉంచడం కూడా అంతే ముఖ్యమన్నారు. మహిళా సమైక్య సభ్యులు జిల్లాలో తయారు చేసే పూతరేకులు, చాక్లెట్స్, లేస్ ఉత్పత్తులను అందమైన ప్రింటింగ్ డిజైనింగ్ బాక్సుల్లో ఆకర్షణీయంగా పెట్టి అందించడానికి అనువైన ప్యాకింగ్ ఐటమ్స్ ను తయారు చేసి అందించాలని ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కోరారు. మీరు తయారు చేసిన ప్యాకింగ్ ఐటమ్స్ లో స్వీట్స్, లేసు ఉత్పత్తులు పెట్టి బహుమతులు, వివాహ వేడుకలు, దీపావళి, సంక్రాంతి వంటి పండగలకు, ఫంక్షన్లకు ఇవ్వడం వల్ల ఆకర్షణీగా ఉండటంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్ కూడా పెరుగుతుందని తెలిపారు. ఉత్పత్తులకు సరిపడే వివిధ షేపులలో బాక్స్ ఐటమ్స్ ను తయారు చేసి అందించాలని కోరారు.
ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, లేస్ పార్క్ మేనేజర్ కుసుమ కుమారి, ఏపీఎంఓలు అమీన్ ఉన్నిసా, నాయుడు, ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.