ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యం అంతమైన వాతావరణాన్ని కల్పించే దిశగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేయడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

మంగళవారం కాళ్ల మండలం పెద్దమిరం యూత్ క్లబ్ రోడ్ సాయిబాబా గుడి శివారు ప్రాంతంలో ఉన్న లే అవుట్ లకు నిబంధనల ప్రకారం వదిలిన 10 శాతం ఖాళీ స్థలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. గ్రామ సర్వేయర్ కిషోర్ ఏఏ ప్రాంతాల్లో ఎంతెంత విస్తీర్ణం ఖాళీ స్థలాలు ఉన్నాయో జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం పట్టణ వాసుల ఆహ్లాదానికి, ఆరోగ్యానికి దోహదపడే పలు ప్రాజెక్టులను దాతల సహకారంతో చేపట్టడం జరిగిందని పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ పనులు పూర్తి అయితే పార్కులు, వాకింగ్ ట్రాక్స్, జిమ్ ఏరియా, గ్రీనరీ అభివృద్ధి, ఫౌంటెన్ లు, పాత బస్టాండ్ పునర్నిర్మాణం, బస్ స్టాప్ లు, తదితరాలు అందుబాటులో వస్తాయని, తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం, సౌకర్యవంతమైన జీవన శైలి సమకూరుతుందన్నారు. అలాగే మిగిలిన మండలాల్లో కూడా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రజలకు ఉపయోగపడే పార్కులు, వాకింగ్ ట్రాక్స్, ఆట స్థలాలు, తదితర అభివృద్ధి పనులు లక్ష్యంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంలో కాళ్ల తహసిల్దార్ జి.సుందర్ సింగ్, ఎంపీడీవో డాక్టర్ బి.స్వాతి, ఇఓపిఆర్డి ఎం.వి భాస్కరరావు, గ్రామ సర్వేయర్ కిషోర్, పంచాయతీ సెక్రటరీ నాగేంద్ర, సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ నాగేంద్ర కుమార్, తదితరులు ఉన్నారు.