ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అర్జీదారులు 80 శాతం సంతృప్తికరంగా ఉన్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

గురువారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పిజిఆర్ ఎస్ అర్జీల పరిష్కారం, రెవిన్యూ అంశాలపై నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో దాసిరాజు, తహాసిల్దార్లు, వీఆర్వోలు తో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలన్నారు. వారు ఏ పని మీద వస్తున్నారు క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులో పెట్టుకున్న విధానమును బట్టి పరిష్కారం చేయాలని అన్నారు. సమస్య పరిష్కారము కానీ ఎడల క్షేత్రస్థాయిలోకి వెళ్లి దరఖాస్తు దారిని, సరిహద్దుదారుని, గ్రామ పెద్దలను కలిసి సమాచారం ఇవ్వాలని అన్నారు. ఐ వి ఆర్ ఎస్ వినతుల పరిష్కారంలో ఫోను ద్వారా సేకరించిన సంతృప్తి చెందని వారి వివరాలను డేటా ద్వారా సేకరించి కొన్ని సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ అప్పటికప్పుడు పరిష్కరించుట జరిగినది. మరికొన్ని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులు ఆదేశించడం జరిగింది. జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసుకోన్న సమస్యల పరిష్కారంలో 80 శాతం సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. నీటి తీరువా పెండింగ్ బకాయిలను వెంటనే వసూలు చేయాలని చెప్పారు. 22- ఏ ఫైల్స్ సంబంధించి పెండింగ్ ఫైల్స్ పూర్తి చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు అందజేయాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గన్ని బ్యాగులు కొరత లేకుండా సకాలంలో రైతులకు అందజేయాలన్నారు. మిల్లలు ద్వారా సేకరించి గోనే సంచులు డామేజీ లేకుండా చూసుకోవాలని, డామేజీలు గుర్తించిన వెంటనే రిఫర్ చేసి కొత్తవి తీసుకోవాలని సూచించారు. దాన్యము, తేమ శాతము, నూక శాతం ను ఆయన పరిశీలించారు. 2024-25 సంబంధించి ధాన్యం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, తహాసిల్దార్లు అయితం సత్యనారాయణ, రాజ్ కిషోర్, వై.దుర్గా కిషోర్, గ్రంధి పవన్, జి.అనిత కుమారి, రవికుమార్, కే.కనకరాజు, ఆర్డీవో కార్యాలయం ఏవో సిహెచ్ పెద్దిరాజు, కె ఆర్ ఆర్ సి తహసిల్దార్ సాయి కృష్ణ, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.