Close

డ్రోన్ కొనుగోలుకు రైతు గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 21/04/2025

శనివారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, డ్రోన్ గ్రూపు సభ్యులు కన్వీనర్, కో కన్వీనర్ లతో సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రోన్ పైలెట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రోన్ కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రూ.10 లక్షల ఋణమును అందజేస్తుందన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు గ్రూపులు కట్టవలసిన ఐదు లక్షలు బ్యాంకులో జమ చేస్తే, మరో ఐదు లక్షల రూపాయలు బ్యాంకులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మూడు సంవత్సరాలలో నాలుగు శాతం వడ్డీతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. డ్రోన్ కొనుగోలు సమయంలో ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ 30 వేలు చెల్లిస్తే రెండు సంవత్సరములు అదనపు వారంటీ ఉంటుందని తెలిపారు. ఈ అదనపు అవకాశమును రైతులు సద్వినియోగం చేసుకొని ఈ గ్రూపును వృద్ధి చేసుకొని ఆదాయాన్ని పొందాలన్నారు. డ్రోన్ లు ఉపయోగంపై రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ శాతం రైతులకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. డ్రోన్ ఉపయోగించుకునే రైతులు వాటి వినియోగం వల్ల పొందే లాభాలను తెలపాలని అన్నారు. రైతుల గ్రూపులను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా తక్షణం ఎకౌంట్లోను ప్రారంభించి లోన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సందర్భంలో
గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ డ్రోన్ యూనిట్ తో పాటు జనరేటర్ తో కలిపి అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

అనంతరం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం పెరేడ్ గ్రౌండ్ నందు డ్రోన్ ఫ్లై చేయించి డ్రోన్ పనితీరును జిల్లా కలెక్టర్ అన్ని గ్రూపుల వారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంలో వారి సందేశాలకు నివృత్తి చేశారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఎల్.డి.ఎం ఎ.నాగేంద్ర ప్రసాద్, డి డి ఎం నాబార్డ్ టి.అనిల్ కాంత్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఎంఏవోలు, గ్రూపు సభ్యులైన కన్వీనర్లు, కో కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.