Close

ఆక్వా సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

Publish Date : 04/04/2025

బుధవారం రాత్రి కలెక్టరేట్ పి.జీ.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో మత్స్యశాఖపై సంబంధిత శాఖాధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా సాగులో రైతులు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులు, వినియోగిస్తున్న నూతన యంత్రాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఆక్వా ఎక్స్చేంజ్, కౌంట్ 366 సంస్థలు ఉపయోగిస్తున్న అదునాతన పరికరాలు అయిన పవర్ మాన్, స్టార్టర్స్ , ఆక్వా బోర్డ్స్ వాటి నిర్వహణ గురించి ఆసంస్థ ప్రతినిధులు జాయింట్ కలెక్టరుకు, మత్స్యశాఖ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మత్స్యశాఖ అధికారులు ఆయా పరికరాలు వాడుతున్న రైతుల వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. అంతేకాకుండా బయోఫ్లాక్ పద్ధతిలో నర్సరీల ఏర్పాటు చేసుకొని రొయ్యలు సాగు చేస్తున్న రైతుల గురించి వారి యొక్క ప్రొడక్టివిటీ తెలుసు కోవాలన్నారు. క్షేత్రస్థాయిలో వాడుతున్న యంత్రాల గురించి వివరాలు సేకరించాలన్నారు. యంత్ర పరికరాల వాడటం వల్ల విద్యుత్ ఆదాపై జిల్లాలో పది మంది రైతులు మీద పరిశీలన చేసి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఆక్వాసాగు విస్తీర్ణం 1,33,037 ఎకరాలుకు గాను 50,732 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ అవడం, మిగిలిన సుమారు 80,000 ఎకరాలను మత్స్యశాఖ అధికారులు రిజిస్టర్ చేయించాలని ఆదేశించారు. ఆక్వా రైతులు వారి యొక్క చెరువులకు లైసెన్స్ తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్.వి.ఎస్. ప్రసాద్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఎల్.ఎన్ .డి.రాజు, సిహెచ్. వెంకటేశ్వరరావు, మత్స్య శాఖ అభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.