జిల్లాలో సాంకేతిక ఆధారిత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి తెలిపారు.

మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖలు ప్రభుత్వ pకార్యదర్శి మరియు పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియామకం కాబడి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఎ.సూర్యకుమారి కి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశంలో జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన పారిశ్రామిక వేత్తల నుండి జిల్లా ప్రత్యేక అధికారి వారు నిర్వహిస్తున్న ఉత్పత్తి యూనిట్లు, ముడి సరుకుల సేకరణ, మార్కెటింగ్, బాంకు రుణాలు మంజూరు, పరిశ్రమల నిర్వహణలో ఎదుర్కొంటున్న తదితర విషయాలను అడిగితెలుసుకున్నారు. పారిశ్రామికవేత్తలు ఎస్.దిలీప్ కుమార్( కోకోనట్ క్లస్టర్), వెంకటేశ్వరరావు (మష్రూమ్ పౌడర్ ),హరీష్ (చాక్లెట్ తయారీ), వంశి (సివిడ్), డాక్టర్ బాబు( ప్లాస్టిక్ చిప్స్), దుర్గారావు (ప్లాస్టిక్ వేస్ట్ నుండి పివిసి పైప్స్ తయారీ), చైతన్య (ఆమోన్గ్స్ పికిల్స్), వాసు (ప్రింటింగ్ క్లస్టర్), పాండు (ఫర్నిచర్ క్లస్టర్) , నారాయణ రావు ప్రోగ్రెసివ్ ఫార్మర్ సమావేశంలో సంబంధిత తయారీ ఉత్పత్తుల గురించి గురించి జిల్లా ప్రత్యేక అధికారికి వివరించారు. సమావేశం దృష్టికి తీసుకువచ్చిన విషయాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి కార్యాచరణను రూపొందించి అమలు చేస్తానని జిల్లా యంత్రాంగం తరపున హామీ ఇచ్చారు. ప్రతినెల జిల్లా కలెక్టర్ తో కలిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తులు తయారీలో పోటీ పడాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు యూనిట్ స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరులో అధికారులు తమ వంతు సహకారం అందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర, పి-4 కార్యక్రమాల అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి జిల్లాకు లక్ష్యాలునిర్దేశించారని, లక్ష్యసాధనకు అందరు సమిష్టిగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్చంద్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాలను సమగ్ర అభివృద్ధి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని సంక్షేమ పథకాలు అమలుతో సహ అన్ని అంశాల పర్యవేక్షణకు నియమించడం జరిగిందని, మన జిల్లాకు మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖలు ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్య కుమారుని నియమించడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం వారి పర్యవేక్షణ, సూచనలు, సలహాలతో జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా అభివృద్ధిలో పారిశ్రామిక అభివృద్ధి ఎంతో ముఖ్యమని, మంచి యూనిట్లు నెలకొల్పడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ యు. మంగపతి రావు, డిఆర్డిఏ పి.డి ఎం.ఎస్.ఎస్ వేణుగోపాల్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జడ్. వెంకటేశ్వరరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఎ.లక్ష్మిడ్వామా, డ్వామా పి.డి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్.దేవానంద కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.