జిల్లాలోని పశు రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని, పశువులను పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
శనివారం ఆచంటలో ఏర్పాటుచేసిన ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తొలుత గోమాతకు శాస్త్రోకత్తంగా పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం పశువుల పరీక్షల నిర్ధారణలో వినియోగించే లేబరేటరీ పరికరాలను పరిశీలించారు. అందాల దూడల ఎంపికలో పాల్గొని, పుంగనూరు జాతి మినియేచర్ ఆవు దూడను స్వయంగా ఎత్తుకుని ముద్దు చేశారు. సూడి ఆవుకు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక పాల దిగుబడుని ఇచ్చే బర్రెలను, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా జిల్లాలోనే మొట్టమొదటిగా జన్మించిన ఆవు దూడను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశు రైతులను ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని, రైతులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఉచితంగా పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువులకు తగిన పరీక్షలు నిర్వహించి మందులను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో జనవరి 20 నుండి జనవరి నెలాఖరి వరకు 183 పశు వైద్య క్యాంపులను నిర్వహించడం జరుగుతుందన్నారు. పశుగణన సర్వే కార్యక్రమాన్ని డిసెంబర్లో ప్రారంభించడం జరిగిందని ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి రైతులు సహకరించాలని కోరారు. నేను కూడా చిన్న తనం నుండి పాడి పంటల మధ్య పెరిగానని ఆనాటి మధుర జ్ఞాపకాలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పశువుల ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ అవసరమని, అలాగే దర్భధారణ కూడా చాలా ముఖ్యమన్నారు. ఆచంట పశు వైద్యులు డాక్టర్ ఫణి కుమార్ సేవలు ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పశువులకు సబ్సిడీపై దాణా మంజూరుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె. మురళీకృష్ణ మాట్లాడుతూ పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, పశువుల అనారోగ్యంకు నివారణ ముఖ్యమన్నారు. పశువుల అనారోగ్య కారణాలతో కోల్పోతే ఆర్థిక నష్టంతో పాటు, మూగ జీవాలు కూడా అనారోగ్యంతో బాధను అనుభవిస్తాయన్నారు. పాల దిగుబడి తగ్గిపోయిన వెంటనే కాలుష్యం టానిక్ ను పెట్టడం కాదని, పచ్చి గడ్డిలో కొన్ని హానిచేసే పరాన్న జీవులు కూడా ఉంటాయని, వాటి నివారణకు పెద్ద పశువులకు ప్రతి ఆరు నెలలకు 90 ఎం.ఎల్ చొప్పున నులిపురుగుల మందును ఇప్పించాలన్నారు. అలాగే నట్టల నివారణకు, గాలికుంటి వ్యాధులను సరైన సమయంలో గుర్తించి మందులను అందజేయాల్సి ఉంటుందన్నారు. పెయ్యి దూడలు మాత్రమే జన్మించేందుకు ప్రస్తుతం 500 రూపాయలు ఖర్చు చేస్తున్నారని, రానున్న ఏప్రిల్ నుండి ప్రభుత్వం సబ్సిడీపై రూ.150/- లకు అందజేయనున్నట్లు తెలిపారు. పిండ మార్పిడి ద్వారా దూడలను పుట్టించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఆచంట పశువైద్యులు డాక్టర్ ఫణి కుమార్, డాక్టర్ తరంగణి దంపతుల సేవలను మెచ్చి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శాలువకప్పి సన్మానించారు. పశుగణాభివృద్ధి సంస్థ అందజేసిన బహుమతులను దూడల అందాల పోటీల్లో గెలుపొందిన దూడ యజమానులకు దాణ గిన్నె, గోమార్ల ముందు, మినరల్స్ కిట్ లను అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క దూడ యజమానికి లీటర్ న్నర పాల క్యాన్ లను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట సరోజిని, జడ్పిటిసి ఉప్పలపాటి సురేష్, ఎంపీటీసీ పృద్వి కుమార్, ఎంపీపీ డి.సూర్యకుమారి, వైస్ ఎంపీపీ లు వై నాగరాజు, టి శ్రీను, నీటి సంఘం కమిటీ చైర్మన్ ప్రసాద్, అన్నదాత గోశాల నిర్వాహకులు చిలుకూరు సత్యవతి, ఆదర్శ రైతు చిలుకూరు వెంకటేశ్వరరావు, తహసిల్దార్ గొట్టిముక్కల కనకరాజు, ఎంపీడీవో ఎన్ బాబ్జి, పశువైద్య శాఖ డిడిలు సుధాకర్, జవ్వార్ హుస్సేన్, ఏడి జయకర్ జాన్సన్, డాక్టర్ ఫణికుమార్, డాక్టర్, డాక్టర్ తరంగిణి, స్థానిక నాయకులు జవ్వాది బాలాజీ, ముచ్చర్ల నాగ వెంకట సుబ్బారావు, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.