Close

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Publish Date : 27/01/2025

• ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

• జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

• ఆకట్టుకున్న జంతు, సాంస్కృతిక ప్రదర్శనలు

• అభివృద్ధిని ప్రతిబింబించేలా శకటాలు, స్టాళ్లు

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో జిల్లా ఆర్మడ్ రిజర్వు, సివిల్ మెన్, ట్రాఫిక్ కాంటింజెంట్, ఎస్.టి.ఎఫ్ కాంటింజెంట్, విమెన్ కాంటింజెంట్, హోం గార్డ్స్ దళాలు గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం జిల్లా ప్రగతి పై సందేశాన్ని అందించారు. సాంస్కృతిక కార్యక్రమాల, శకటాల ప్రదర్శనను తిలకించి, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, శాసన మండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి, జిల్లా రెవిన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు, జిల్లా ఏఎస్పి వి.భీమారావు, ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కునాదిరాజు మురళీ కృష్ణంరాజు, కెఆర్ఆర్ సి డిప్యూటీ కలెక్టరు బి.శివనారాయణ రెడ్డి, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, డిఎస్పీ లు ఆర్.జి. జయసూర్య, డా.జి.శ్రీ వేద, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందేశమిస్తూ భారతదేశ గణతంత్రం దేశంగా ఆవిర్భవించి 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.1950 జనవరి 26న ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భవించడం వల్లే భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాలను పూర్తిస్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా జిల్లాలో సంతృప్తి స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు.

గణతంత్ర దినోత్సవ శుభ తరుణంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, బేటీ బచావో బేటీ పడవో మన జిల్లాలో దిగ్విజయంగా నిర్వహించి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న, జిల్లా జాయింట్ కలెక్టరు, జిల్లా అధికారులు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం తమ సహాయ సహకారాలను అందిస్తున్న ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభ తరుణంలో జిల్లా, రాష్ట్ర, దేశ ప్రగతికి ప్రజలందరం పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ కోరారు.

 

2.11

2.332.22

 

1.11