Close

పశువుల షెడ్ల నిర్మాణాల లక్ష్యంలో వెనుకబడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు

Publish Date : 19/12/2024

గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోకులం షెడ్ల నిర్మాణాల పురోగతి, అంగన్వాడీ పిల్లలకు ఆధార్ ఎన్రోల్మెంట్, మిస్సింగ్ హౌస్ డేటా ఎన్రోల్మెంట్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఎన్.పి.సి.ఐ నమోదు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 900 పశువుల షెడ్ల నిర్మాణ లక్ష్యంగా రూ.18.40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు ఇప్పటివరకు కేవలం 50 షెడ్లను మాత్రమే పూర్తి చేయడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్ల నిర్మాణ పనులలో ప్రగతి సాధించని ఏపీవో, ఈసీ, టిఏ లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ గట్టిగా హెచ్చరించారు. నిర్మాణ క్రమంలో స్టేజ్ కన్వర్షన్ పురోగతి రోజు రోజుకు పెరగాలని, బేస్ మెంట్ లెవెల్ పూర్తి చేయబడినవి రూప్ లెయిడ్ వరకు నమోదు కావాలి అన్నారు. జిల్లా లో అత్యధికంగా పశువుల షెడ్లు మంజూరు పొందిన మండలాలు తాడేపల్లిగూడెం 64, తణుకు 57, పాలకొల్లు 53, నర్సాపురం 51, యలమంచిలి 50 ఉన్నాయన్నారు. అతి తక్కువగా మంజూరు పొందిన మండలాలు ఆకివీడు 36, పెనుగొండ 37, పెనుమంట్ర 41, ఆచంట 44, పెంటపాడు 44, ఇరగవరం 44 ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 462 పనులకు ఎర్త్ వర్క్ పూర్తి చేయబడినవని తెలిపారు. అతి తక్కువగా అత్తిలి 6, పోడూరు 15, ఇరగవరం 17, ఉంది 19, పెంటపాడు 19 పనులు ఎర్త్ వర్క్ పూర్తి చేయబడినవని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అలాగే బేస్ మెంట్ లెవెల్ పూర్తి చేయబడిన మొత్తం పనులు 256 వున్నాయని, రూఫ్ లెయిడ్ వరకు నమోదు చేయబడిన మొత్తం పనులు 31 ఉన్నాయన్నారు.

ఆధార్ ప్రత్యేక క్యాంపులను వినియోగించుకొని అంగన్వాడి పిల్లల ఆధార్ నమోదును వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో సుమారు 25 వేలు నమోదు చేయాల్సి ఉండగా చాలా తక్కువ మొత్తంలో నమోదు కావడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. డిసెంబరు చివరినాటికి ఎట్టి పరిస్థితుల్లో నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

వివిధ శాఖలు, ఇతర వెబ్సైట్ ల ద్వారా సేకరించిన మిస్సింగ్ హౌస్ హోల్డ్ డేటా 1,60,778 ఉందని, వీటిలో ఇప్పటివరకు 28,519 వెరిఫై చేసి కేవలం 4,453 మాత్రమే నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మిగతావారు వివిధ కారణాలతో వేరు, వేరు ప్రదేశాల్లో ఉండటంతో నమోదుకు సాధ్యపడలేదని తెలిపారు. మిగతా మిస్సింగ్ డేటాను కూడా వెరిఫై చేసి త్వరితగతిన నమోదు పూర్తి చేయాలన్నారు. అలాగే వివిధ సంక్షేమ పథకాలు అమలకు ఎన్.పి.సి.ఐ బ్యాంక్ ఎకౌంటు నమోదు 97.50 శాతం, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ 96 శాతం పూర్తి చేయడం జరిగిందని, నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పి.డి డాక్టర్ కే సి హెచ్ అప్పారావు, జిల్లా జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి వై.దోసి రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె.మురళీకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, తదితరులు ఉన్నారు.