ఈ నెల 17వ తేది నుంచి అక్టోబరు 2వ తేది వరకు నిర్వహించే స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులతోను, మీకోసం సమావేశ మందిరం నందు పంచాయతీరాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, వైద్య శాఖ తదితర అధికారులతో విడివిడిగా సమావేశం అయ్యారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ముందస్తు ప్రణాళిక చర్యలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి మాట్లాడుతూ భారత ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి సంవత్సరం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం సెప్టెంబరు 17వ తేది నుండి అక్టోబరు 2వ తేది వరకు “క్లీన్లైన్స్ ఈజ్ సర్వీస్” అనే నినాదంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఎంపిడిఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డిఎస్, డిఎల్పిఓలు, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. గత సంవత్సరం 2023లో “చెత్త లేని భారతదేశం” అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం 2024లో “స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత” పేరిట సెప్టెంబరు 17వ తేది నుండి అక్టోబరు 2వ తేది వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం చేపట్టడం జరుగుతుందని, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆయా శాఖల ద్వారా సమన్వయం చేసుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ద్వారా చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ చర్యలను ప్రతిఒక్కరు తప్పక పాటించాలని కోరారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ.. పరిశుధ్యంపై అవగాహన పెంచుకుని.. మన ఇంటి లాగే.. మన పరిసరాలు, మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. చెత్త నుంచి సంపద సృష్టించే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మురికి కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, చెత్త నిల్వ లేకుండా చూడాలన్నారు. మన జిల్లాలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ చెబుతాను సిద్ధం చేసి, వారి విధులను గౌరవిస్తూ అక్టోబర్ రెండో తేదీన వారికి అవార్డులు ప్రదానం చేయాలన్నారు. స్వచ్ఛ భారత్ దివస్ లో భాగంగా స్వచ్ఛత మైన్ జన్ భాగీదారి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలన్నారు. రెండు వేర్వేరు చెత్త సేకరణ బుట్టల ద్వారా ప్రతి ఇంటినుండి తడి చెత్త, పొడి చెత్తను పారిశుధ్య సిబ్బంది ప్రతి ఇంటి నుండి సేకరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో నగరాన్ని మరింత స్వచ్చంగా తీర్చి దిద్ది రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. బయోగ్యాస్ ప్లాంట్ లు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నీటి వనరులు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, విద్యార్థులతో మానవహారాలు ఏర్పాటు, త్రీకె రన్ నిర్వహణ, ప్రతిజ్ఞ చేయించడం తదిత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెత్త కుప్పలు ఎక్కడ కనిపించకూడదని, చెత్త నిర్వహణ కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 17 నుండి స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ప్రజా ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సెప్టెంబర్ 17 తారీఖున జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డి వార్మింగ్ టాబ్లెట్లను అందించాలని సూచించారు. జిల్లాలో 3,67,000 మంది విద్యార్థులకు డి వార్మింగ్ టాబ్లెట్లను అందించే లక్ష్యంగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల సహకారంతో వైద్య సిబ్బంది ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. చివరిగా స్వభావ్ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో కూడిన సమాచారం గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జె.ఉదయ భాస్కరరావు, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జెడ్ పి. డిప్యూటీ సీఈవో ఎస్.నిర్మల జ్యోతి, డిపిఓ ఆర్.విక్టర్, డి ఎల్ డి ఓ డాక్టర్ కేసిహెచ్ అప్పారావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఇ నాగేశ్వరరావు, జిల్లాకు శాఖ అధికారి, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్ గౌరీశ్వరరావు, డిఎంహెచ్వో డాక్టర్ డి మహేశ్వరరావు, ఐ సి డి ఎస్ పి డి బి.సుజాత రాణి, సోషల్ వెల్ఫేర్ అధికారి కె.శోభ రాణి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి పుష్ప రాణి, బీసీ వెల్ఫేర్ అధికారి గణపతి, ఎల్ డి ఎం నాగేంద్రప్రసాద్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. శ్రీనివాసరావు, వీధి శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.