మీకోసం లో వచ్చిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ట కాన్ఫిడెన్స్ హాలులో జిల్లాలోని రెవిన్యూ డివిజన్ అధికారులు, తాహసిల్దార్లు, సర్వేర్లతో పి.జి.ఆర్.ఎస్ ఫిర్యాదులు, తదితర రెవిన్యూ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీకోసం పి జి ఆర్ ఎస్ లో అందిన ఫిర్యాదులను నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం మీ కోసం ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు ఫిర్యాదును అందజేసే సమయంలో చెప్పే విషయాలు శ్రద్ధగా వినడం చేయాలన్నారు. అవసరమైతే అర్జీ దారులను పిలిపించుకుని ఎన్ని రోజుల్లో ఏవిధంగా సమస్యను పరిష్కరించడానికి వీలవుతుందో కూడా తెలియజేయాలన్నారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా పరిష్కార పిటీషన్లు ఆర్డీవోలు, తాహాసిల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని అన్నారు. ప్రజా పరిష్కార పిటీషన్లపై ప్రజలు దాఖలు చేసిన ఫిర్యాదులపై ఎవరైనా సమగ్ర నివేదికలు చేసి ఎండార్స్మెంట్లు ఇచ్చిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రజా పరిష్కార ఫిర్యాదులపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా నోడల్ ఆఫీసర్, ఆడిట్ టీం క్షుణ్ణంగా తనిఖీ చేయటం జరుగుతుందని అన్నారు. వచ్చిన ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కారం చేయాలని చెప్పారు. తమ కార్యాలయంకు వచ్చిన ఫిర్యాదులు తమకు సంబంధించినవి కాకపోతే ఏ కార్యాలయమునకు చెందినవి అయితే ఆ కార్యాలయమునకు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు,
నరసాపురం ఆర్డీవో ఎం.అచ్యత్ అంబరీష్, తాడేపల్లిగూడెం ఇంచార్జ్ ఆర్డీవో బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి డా: కె సి హెచ్ అప్పారావు, మండల తాహసిల్దార్లు, సర్వేలు, తదితరులు పాల్గొన్నారు.