Close

ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా ద్వారా 19 ఏళ్ల లోపు పిల్లలు అందరూ ఆల్ బెండజోల్ మాత్రలు తప్పక వేసుకనేలా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ముమ్మర పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Publish Date : 15/09/2024
cdm1

బాలబాలికలలో రక్తహీనతకు ప్రధానంగా జీర్ణవ్యవస్థలో చేరిన నులి పురుగులు కారణమౌతున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏటా జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది అన్నారు. జిల్లాలోని 1,617 అంగన్ వాడీ కేంద్రాలు, అన్ని యాజమాన్యాల క్రింద 1,894 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు 165, సాంకేతిక విద్యా సంస్థలలతో పాటు బడిలో నమోదు కాని బాలలు, వెరసి 1 నుండి 19 వయస్సు కలిగిన సుమారు 3,64,400 మంది బాలబాలికలందరికీ ఈ నెల 17వ తేదీన నిర్థేశిత మోతాదు, విధానం ప్రకారం అల్ బెండజాల్ మాత్రలు తప్పని సరిగా తల్లిదండ్రులు ప్రత్యేక బాధ్యత చేపట్టలాలని ఆమె అందించేంలా ప్రధానోపాధ్యాలు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్లను కోరారు. ఇందుకు అవసరమైన మాత్రల నిల్వలను మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓల ద్వారా తమ పరిధిలోని అంగన్ వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలకు సరఫరా చేయాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. ఈ మాత్రలను, రెండేళ్ల లోపు పిల్లలకు అర టాబ్లెట్, 2 నుండి 19 ఏళ్ల లోపు పిల్లలకు పూర్తి టాబ్లెట్ ను, ఏదేని ఆహారం స్వీకరించిన తర్వాత శుభ్రమైన త్రాగునీటితో వేసేలా ఉపాధ్యాయులు, ఆశావర్కరులు, ఎఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. సురక్షితమైన ఈ మాత్రలు వేసినపుడు అరుదుగా ఎవరికైనా స్వల్ప అస్వస్థత అనిపిస్తే అవసరమైన చికిత్సను అన్ని పిహెచ్సిలలో అందుబాటులో ఉంచాలన్నారు. అల్ బెండజాల్ మాత్రల పంపిణీతో పాటు ఆహారం తీసుకునే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుగుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, చెప్పులు ధరించడం వంటి ఆరోగ్య అలవాట్ల గురించి పిల్లలందరికీ తప్పని సరిగా ప్రదర్శనా పూర్వకంగా వివరించాలన్నారు. 17వ తేదీన ఏకారణం చేతైనా మాత్రలు వేసుకోని పిల్లలు మిగిలిపోతే అటువంటి వారందరికీ కూడా మాప్ అప్ కార్యక్రమాల ద్వారా పంపిణీ చేయాలని, ఏ ఒక్కరూ మాత్రలు మిస్ కాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ నెల 30వ తేదీన తమ విద్యా సంస్థలో పిల్లలు ప్రతి ఒక్కరికీ అల్ బెండజాల్ మాత్రలు పంపిణీ చేశామనే ధృవీకరణ తమకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యవంతమైన భావి పౌరులను దేశానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఆరోగ్య సిబ్బంది సమిష్టిగా జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.