తాడేపల్లిగూడెం ఎంఈఓలు, ఉపాధ్యాయులు, సిబ్బంది రూ.2,60,500/- లు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ (అప్సా) రూ.1,26,069/- వరద సహాయం.
గురువారం స్థానిక జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్ నందు తాడేపల్లిగూడెం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలసి రూ 2,60,500/- లు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ (అప్సా) భీమవరం డివిజన్ తరపున రూ 1,26,069/- లు చెక్కులను విజయవాడ వరద బాధితుల సహాయార్థం జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి కి జిల్లా విద్యాశాఖ అధికారి జి.నాగమణి, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అప్సా అసోసియేషన్ సభ్యులు విడివిడిగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కష్టాలను అర్థం చేసుకుని ముందుకు వస్తున్న దాతలు సహాయం అభినందనీయమన్నారు. ఆపద సమయంలో ఆదుకున్నప్పుడే బాధితులకు మనోధైర్యం, కొంత ఊరట కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని, అప్సా అసోసియేషన్ సభ్యులను జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి.నాగమణి, తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖ అధికారులు వి.హనుమ, పిఎంకె జ్యోతి, ప్రధానోపాధ్యాయులు ఎం సత్యనారాయణ, అప్సా అసోసియేషన్ సభ్యులు సుంకర మాణిక్యాలరావు, తిరుమల రవి, స్వర్ణలత, నందమూరి రాజేష్, సుభద్రాదేవి, హరి సింగ్, దితరులు పాల్గొన్నారు.