• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి-ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 04/08/2025

స్థానిక కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలి

సంబంధిత జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించిన ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

జిల్లాలో ఈ నెల 15వ తేదీన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షి నిర్వహించారు. ఈ సందర్బంగా ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ స్పూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలు నిర్వహించే కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల నిర్వహణకు వేదికను తగిన విధంగా అలంకరించి సిద్ధం చేయాలన్నారు. సీటింగ్ ఏర్పాట్లు, విఐపిలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని , శానిటేషన్, త్రాగునీటి సరఫరా, తదితర ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దేశభక్తి పెంపొందించేలా విద్యార్ధులచే సాంస్కృతిక ప్రదర్శనలు వినూత్న తరహాలో అందరిని ఆకర్షించేలా నిర్వహించాలని విద్యాశాఖ అధికారి ఆదేశించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొనే విద్యార్ధినీ, విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటడంతో పాటు వారికి స్నాక్స్ ఏర్పాటు చేయాలని డిస్టిక్ సివిల్ సప్లయ్ అధికారిని ఆదేశించారు మున్సిపల్ కమిషనర్ శానిటేషన్ ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. త్రాగునీటి ఏర్పాట్లను ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. గ్రౌండ్ లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడకం ఉండకూడదని వాటర్ టిన్స్ ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు వినియోగించాలని అన్నారు. విద్యుత్ కు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించే విధంగా స్టాల్స్ ఏర్పాటు, శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అయా శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి చేసే ఏర్పాట్లులో ఎటువంటి లోటు పాట్లుకు తావులేని విధంగా దగ్గర ఉండి పర్యవేక్షించాలని భీమవరం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ లను ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ. మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, సిపిఓ కె.శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా.కె సి హెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.