76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు, స్టాల్స్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి…

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :దేశ భక్తిని, జాతీయ భావాన్ని రగిల్చేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. పాలకొల్లు భారతి విద్యా భవన్, తణుకు జడ్పీ హై హైస్కూల్, భీమవరం పి ఎస్ ఎం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తిని చాటుతూ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలలు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ బహుమతిని, పాలకొల్లు భారతీయ విద్యా భవన్ విద్యార్థుల బృందం ద్వితీయ బహుమతి, భీమవరం పిఎస్ఎన్ గర్ల్స్ మున్సిపల్ హై స్కూల్ తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి.
అభివృద్ధిని ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన : పలు శాఖలు తమ ప్రగతిని ప్రతిబింబించేలా ప్రదర్శించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల శకటాల ప్రదర్శనలో విద్యా శాఖకు ప్రధమ బహుమతి, వ్యవసాయ శాఖకు ద్వితీయ బహుమతి, పశుసంవర్ధక శాఖ తృతీయ బహుమతిని అందుకున్న వారిలో ఉన్నారు. పశుసంవర్ధక శాఖచే ఏర్పాటుచేసిన జంతు ప్రదర్శన ప్రత్యెక ఆకర్షణగా ఉండి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, విద్యుత్ శాఖ, విద్య శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఉద్యానవన శాఖ, అగ్నిమాపక శాఖ, వ్యవసాయ శాఖలు అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రదర్శిస్తూ శకటాలను ఏర్పాటు చేశాయి. శకటాల ప్రదర్శన అధికారులను, ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్టాల్స్ ప్రదర్శన : వివిధ శాఖలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉద్దేశిస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ, మహిళా అభివృద్ధి మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, అగ్నిమాపక శాఖ, మెప్మా, జిల్లా గ్రామ పంచాయతీ శాఖ, ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, పరిశ్రమల శాఖ, అటవీ శాఖ, చేనేత జౌళి శాఖలు మొత్తం 18 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ప్రజలను భాగ ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్ని స్టాల్స్ ను సందర్శించి ఆయా శాఖల ప్రదర్శనలను తిలకించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. స్టాల్స్ ఏర్పాటులో ప్రతిభ కనబరచిన స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రథమ బహుమతిని, మత్స్యశాఖ ద్వితీయ బహుమతిని, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తృతీయ బహుమతిని గెలుపొందాయి.
కవాతు ప్రదర్శనలో కడగట్ల గురుకుల పాఠశాల విద్యార్థులు స్కాట్లాండ్ బ్యాగ్ పైప్ బ్యాండ్ బృందం ప్రదర్శనకు ప్రత్యేక అవార్డును అందుకున్నారు.
అన్ని విభాగాల్లో గెలుపొందిన ఆయా శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.