25 మంది టీబి రోగులను దత్తత తీసుకొని పౌష్టికాహారం అందించేందుకు ముందుకు వచ్చిన పశ్చిమ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని రోల్ మోడల్ గా తీసుకోవాలి….సెంట్రల్ టీబీ డివిజన్ అడిషనల్ హెల్త్ సెక్రటరీ

ప్రధానమంత్రి టిబి ముక్త భారత్ అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీబీ డివిజన్ హెల్త్ అడిషనల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జి. గీతాబాయి, జిల్లా టిబి, లెప్రసి మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ కె.రవికుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా 60 సంవత్సరాల పైబడిన వారు, షుగర్ పేషెంట్స్, రోగానిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఆల్కహాల్ తీసుకునేవారు, స్మోకర్స్, గతంలో టీబీ వ్యాధి బారిన పడినవారు, టిబీ వ్యాది గ్రాస్తుల ఇళ్లలో వున్నవారు వీరంతా పరీక్షలు చేయించుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా సరే టీబీ పేషెంట్లకు పౌష్టిక ఆహారాన్ని అందజేయడానికి దత్తతు తీసుకోవచ్చు అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 50 మంది దాతలు టీబీ రోగులకు వైద్య చికిత్స, పోషకాహారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. 700 మంది టీబి రోగులకు దాతల ద్వారా పౌష్టికాహారం అందించడం జరుగుతోందన్నారు.
ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 25 మంది టీబీ పేషెంట్లను దత్తత తీసుకొని పౌష్టికారం అందిస్తున్నానని అడిషనల్ హెల్త్ సెక్రటరీకి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని అభినందిస్తూ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ను రోల్ మోడల్ గా తీసుకోవాలని అడిషనల్ హెల్త్ సెక్రటరీ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జి.గీతాబాయి, జిల్లా టిబి, లెప్రసి మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ కె.రవికుమార్ పాల్గొన్నారు.