Close

స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 20/05/2025

మంగళవారం నరసాపురం మండలం పలు గ్రామాలలో స్వయం సహాయక గ్రూపులు నిర్వహిస్తున్న యూనిట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్వేశ్వరం గ్రామంలో పిండి వంటలు స్వీట్లు తయారు చేసి యూనిట్, సార్వ గ్రామంలో మినీ డైరీ యూనిట్, తూర్పుతాళ్లలో ఫ్లోర్ మిల్లు పచ్చళ్ళు తయారు చేసే యూనిట్, చామకూరి పాలెం లో డొక్క తాడు పరిశ్రమను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించి, యూనిట్ నడిపే వారి సభ్యులతో మాట్లాడారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మీ పిల్లలు ఏమి చదువుతున్నారు, ఏమి పనులు చేస్తారని ఆరా తీశారు. మీరు తయారు ఐటమ్స్, మార్కెట్ ఏ విధముగా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని అన్నారు. స్వశక్తితో నిలబడేందుకు బ్యాంకు రుణాలు బ్యాంకు లింకేజీ సి ఐ ఎఫ్, స్త్రీ నిధి, పీఎం ఈజీ ఏపీ, తదితర ప్రభుత్వ బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

జిల్లా కలెక్టర్ వెంట ఆర్డిఓ దాసిరాజు, డి ఆర్ డి ఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తాహసిల్దార్ అయితం సత్యనారాయణ, ఏపిఎం నాగభూషణం నాయుడు, సీసీలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.