Close

స్వమిత్వ సర్వే ప్రక్రియను వేగవంతంచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 13/02/2026

జిల్లాలో ఫేజ్- 2 స్వమిత్వ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, స్వమిత్వ ప్రోగ్రెస్ పై జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయితీ కార్యదర్శులు, స్వమిత్వ కేటాయించిన సర్వేయరులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఫేజ్- 2 స్వమిత్వ సర్వే జరుగుచున్న 197 గ్రామాలుగాను చివరి దశకు చేరుకున్న 54 గ్రామాలు సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా గ్రౌండ్ ట్రూత్ నింగ్ గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. భూ యజమానుల హక్కులను స్పష్టంగా నమోదు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అని అన్నారు. ఇప్పటికే పూర్తయిన గ్రామాలు వివరాలు పెండింగ్ లో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు సర్వేలో ఎలాంటి నిర్లక్ష్యం ఆలస్యము ఉండకూడదని అన్నారు. ముందుగా స్వమిత్వ గ్రామసభలు నిర్వహించాలన్నారు. గ్రామసభలలో ప్రజల వద్ద నుండి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఆయా గ్రామాలలో తుదిదశకు తీసుకువచ్చినవి గెజిట్ నోటిఫికేషన్ రిపోర్టును, అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు.

ఈ గూగుల్ మీట్ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఎన్.రామ్ నాథ్ రెడ్డి, జిల్లాలోని అందరూ డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, స్వమిత్వ కేటాయించిన సర్వేయర్లు పాల్గొన్నారు.