Close

స్వచ్ఛమైన తాగునీటి ద్వారా 90 శాతం రోగాలకు దూరం కావచ్చునని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.

Publish Date : 10/04/2025

గురువారం భీమవరం బస్టాండ్ లో, జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక యువి వాటర్ ప్లాంట్లను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, మాట్లాడుతూ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సహకారంతో ఒక్కొక్క వాటర్ ప్లాంట్ ను రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయం అన్నారు.బస్టాండ్ లో ప్రయాణికులకు, కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు దాహార్తి సమస్య లేకుండా ఈ వాటర్ ప్లాంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరం బస్టాండ్ ద్వారా సుమారు 50 వేలమంది ప్రయాణాలను కొనసాగిస్తారని, ఓకే దఫా సుమారు ఆరు వేల మంది వరకు ప్రాంగణంలో ఉంటారని తెలిపారు. వీరందరి దాహార్తిని తీర్చేందుకు ఈ ప్లాంట్ ఎంతగానో దోహదపడుతుంది అన్నారు. అవకాశాన్ని ప్రయాణికులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

భీమవరం శాసనమండలి సభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆనందరాజు ఫౌండేషన్ ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ యూనిట్ ద్వారా ప్రతిరోజు 3 వేల లీటర్లు అత్యంత పరిశుభ్రమైన ఫిల్టర్ వాటర్ ను పొందగలుగుతామన్నారు. మంచి నాణ్యత గల నీటిని త్రాగడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. బస్టాండ్ ప్రాంగణంలో టాయిలెట్స్ బాగోలేదని వీటి స్థానంలో అధునాతనమైన టాయిలెట్లు ఏర్పాటుకు ఆర్ఎం, డిఎం చర్యలు తీసుకోవాలని తెలిపారు.

క్యాంటీన్ లలో పరిశుభ్రత లేకుంటే కఠిన చర్యలు తప్పవు .. … జిల్లా కలెక్టర్

తొలుత జిల్లా కలెక్టర్ బస్టాండ్ ప్రాంగణం అంతా అణువణువునా పరిశీలించారు. టాయిలెట్లు, క్యాంటీన్, చంటి పిల్లలకు పాలు ఇచ్చే గది పరిశీలించి డిపో మేనేజర్ కు పలు ఆదేశాలు జారీ చేశారు. క్యాంటీన్ లో పరిశుభ్రత లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాంటీన్ లోని టిఫిన్స్ తిని పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. ఎక్కడిక్కడ చెత్త లేకుండా శుబ్రంగా ఉంచుకోవాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా టాయ్ లెట్స్ కూడా శుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పిల్లలకు పాలు గది కూడా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ రెండు యు వి వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగిన విషయమన్నారు. ప్రయాణకులకు కాకుండా, కలెక్టరేట్ వచ్చే పిజిఆర్ఎస్ ఫిర్యాదు దారులకు కూడా మంచి స్వచ్ఛమైన నీటిని అందజేయడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎంవిఆర్ వరప్రసాద్, డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్ మేనేజర్ సురేష్, ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు, కంతేటి వెంకటరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, చెరుకువాడ రంగసాయి, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ఆర్టీసీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.