స్త్రీనిధి రుణాలు పారదర్శక చెల్లింపులకు బయోమెట్రిక్ డివైజ్ లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
సోమవారం భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా గ్రామ సంఘాల సభ్యులకు బయోమెట్రిక్ డివైజ్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు ప్రతి సంవత్సరం సుమారు 220 కోట్ల రూపాయలను స్త్రీ నిధి రుణాలుగా అందజేయడం జరుగుచున్నదన్నారు. ఇటీవల రుణాలు తిరిగి చెల్లింపులో జరుగుచున్న అవకతవకలను అరికట్టేందుకు, పారదర్శకంగా క్యాష్ లెస్ లావాదేవీలను నిర్వహించేందుకు జిల్లాలోని గ్రామ సంఘాలకు 850 బయోమెట్రిక్ డివైజ్ లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ బి.శివన్నారాయణ రెడ్డి, డిఆర్డిఎ పి.డి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, గ్రామ సంఘాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.